ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్ తాజాగా పెళ్లి పీటలెక్కిన సంగతి మనకు తెలిసిందే.గత ఏడాది ఎంగేజ్మెంట్ చేసుకున్న నార్నె నితిన్ ఫైనల్ గా ఈ ఏడాది పెళ్లి పీటలెక్కారు.అయితే అలాంటి నార్నె నితిన్ పెళ్లి చేసుకున్న అమ్మాయికి సంబంధించి ఒక షాకింగ్ విషయం నెట్టింట్లో వైరల్ అవుతుంది. అదేంటంటే..నార్నె నితిన్ పెళ్లి చేసుకున్న శివాని ఆ హీరోకి భార్య కావాల్సిందట.కానీ ఆ హీరో వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో నార్నె నితిన్ కి శివాని భార్య అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇంతకీ శివాని నితిన్ ని కాకుండా ఏ హీరోని చేసుకోవాల్సిందో ఇప్పుడు తెలుసుకుందాం. నితిన్ ని పెళ్లి చేసుకున్న శివాని బ్యాగ్రౌండ్ బిజినెస్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ అని తెలుస్తోంది. వీరిది ఏపీలోని నెల్లూరు అయినప్పటికీ బిజినెస్ కోసం హైదరాబాద్ కు వెళ్లి అక్కడే సెటిల్ అయ్యారట.

అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న శివాని నార్నె నితిన్ కంటే ముందు ఆ హీరోకి భార్య అయ్యేది అంటూ సోషల్ మీడియాలో ఒక రూమర్ వైరల్ అవుతుంది. అదేంటంటే.. శివాని నితిన్ పెళ్లికి దగ్గుబాటి ఫ్యామిలీ మొత్తం తరలి వచ్చిన సంగతి మనకు తెలిసిందే. వెంకటేష్,రానా,నాగ చైతన్య,దగ్గుబాటి అభిరామ్,సురేష్ బాబు ఇలా దగ్గుబాటి ఫ్యామిలీ మొత్తం ఈ పెళ్లిలో హడావిడి చేసింది.అయితే దగ్గుబాటి ఫ్యామిలీ మొత్తం ఈ పెళ్లికి వచ్చారంటే ఏదో దగ్గరి సంబంధమే ఉన్నట్టు తెలుస్తోంది. అయితే నితిన్ పెళ్లి చేసుకున్న శివాని రామా నాయుడు కి వరుసకి మనవరాలు అవుతున్నట్టు తెలుస్తోంది. 

అలా వెంకటేష్ కి కూతురు వరస అని, రానాకి చెల్లెలి వరస అవుతుంది అని తెలుస్తుంది. ఈ లెక్కన రానాకి చెల్లెలు అంటే నాగచైతన్యకి మరదలు అనే కదా అర్థం.. అయితే ఈ విషయాన్ని కొంతమంది నెటిజెన్స్ వైరల్ చేస్తూ మొదట నాగచైతన్యకు ఆ అమ్మాయిని ఇవ్వాలనుకున్నారు కావచ్చు. కానీ నాగచైతన్య మొదట సమంతని,ఆ తర్వాత శోభిత దూళిపాళ్లని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కాబట్టి శివాని నార్నె నితిన్ తో ప్రేమలో పడిపోయింది అంటూ ఓ రూమర్ వైరల్ చేస్తున్నారు. కానీ మరి కొంత మందేమో ఇదంతా రూమర్ అంటూ కొట్టి పారేస్తున్నారు. ఇక నార్నె నితిన్ శివాని ల పెళ్లిలో ఎన్టీఆర్ హడావిడి మాములుగా లేదు. పెళ్లికి వచ్చిన గెస్ట్ లందరిని పలకరిస్తూ హడావిడి చేసేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: