మన టాలీవుడ్ ఇండస్ట్రీ ఎప్పుడు ఎవరి కెరీర్ను మార్చేస్తుందో అస్సలు గుర్తించలేము . ఒకరు ఎంత ట్రై చేసినా ఇండస్ట్రీలో పెద్ద ఫేమస్ అవ్వరు . కొందరు బ్యాక్ ౌండ్ ఉన్నప్పటికీ లక్ మాత్రం కలిసి రాదు . కానీ కొంతమంది నటినట్లు చిన్న చిన్న పాత్రల్లో కనిపించి మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ఉంటారు . అదేవిధంగా స్టార్ హీరోలుగా ఎదుగుతారు కూడా . అటువంటి వారిలో స్టార్ బాయ్ సిద్దు కూడా ఒకరు . సైడ్ క్యారెక్టర్స్ మరియు విలన్ క్యారెక్టర్స్ తో మైమరిపించిన ఈయన హీరోగా పలు చిత్రాల్లో నటించినప్పటికీ అతని కెరీర్ ఓ గాడిలో పడింది మాత్రం.. డీజె టిల్లు సినిమాతోనే . ఈ మూవీలో తన అద్భుతమైన నటనతో మంచి ప్రయోజనం సంపాదించుకున్నాడు సిద్దు ‌.


ఇక ప్రస్తుతం సిద్దు నటిస్తున్న .. తెలుగు కదా మూవీ దివాలి కానుక విడుదల కానుంది . ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా కొనసాగుతున్నాయి కూడా ‌. ఈ నేపథ్యంలోనే .‌.. సిద్దు జొన్నలగడ్డ మరియు మాస్ మహారాజ్ రవితేజ తో కలిసి ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది . ఈ ఇంటర్వ్యూలో వీరిద్దరి మధ్య జరిగిన చిట్ చాట్ చాలా ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు ‌. సినిమాలు గురించి మొదలైన ఈ సంభాషణ బయోపిక్ పై చర్చనీయాంశం అయింది . ఈ ఈ సమయంలోనే సిద్దు జోనల్ గడ్డ ఒక సర్ప్రైజ్ విషయాన్ని వెల్లడించడం జరిగింది . తన కృష్ణ అండ్ హిస్ లీలా మూవీ రిలీజ్ అయిన అనంతరం తాను రవితేజ జీవితంపై ఓ బయోపిక్ చేయాలని అనుకుంటున్నాను అని వెల్లడించడం జరిగింది .


అంతేకాకుండా దానికి సంబంధించిన కాన్సెప్ట్ పై దాదాపు రెండు నెలల పాటు పని చేశానని కూడా తెలిపాడు ‌. ఈ వ్యాఖ్యలు విన్న రవితేజ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడని చెప్పుకోవచ్చు . రవితేజ దీనికి స్పందిస్తూ .. తను ఒక నటుడి బయోపిక్ చేయాలనుకున్నానని .. కానీ దాని గురించి ఇప్పుడు వివరాలు చెప్పలేదని అన్నారు ‌. ఇక ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలు బయోపిక్ పై చర్చించుకోవడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది . మరి రవితేజ పై సిద్దు చేసిన ప్లాన్ ఎప్పుడు రియాలిటీ లోకి వస్తుందో చూడాలి . ప్రెసెంట్ దీని గురించి సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వార్తలు వినిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు .

మరింత సమాచారం తెలుసుకోండి: