అవికా గోర్ .. ఇలా చెప్పితే పెద్దగా గుర్తు పట్టకపోవచ్చు కానీ .‌.. చిన్నారి పెళ్లికూతురు అని చెప్పితే ఇట్టే గుర్తుపడతారు . చిన్నవయసులోనే చిన్నారి పెళ్లికూతురు అనే సీరియల్ తో మంచి పేరు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ అనంతరం సినిమాలలోకి షిఫ్ట్ అయ్యి తనదైన నటనతో మెప్పిస్తుంది . ఈ ముద్దుగుమ్మ ఇటీవల షణ్ముఖ మూవీతో ప్రేక్షకులను అలరించడం జరిగింది . వరుస మూవీలతో ఫుల్ పేమ్ లో ఉన్న ఈ భామ సడన్గా బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బాయ్ చెప్పి తన ప్రియుడు మిలింద్ చద్వాని నీ వివాహమాడింది .


సెప్టెంబర్ 30న వీరిద్దరూ రియాలిటీ షోలో ఒకటి అవడం జరిగింది . ఐదేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట కొత్త జీవితాన్ని ప్రారంభించారు . ఇక ఈ విషయం తెలుసుకున్న వారంతా ఇండస్ట్రీకి దూరం అవుతుందని భావిస్తున్నారు . ఈ క్రమంలోనే తాజాగా అవికా కొత్త సినిమా ప్రకటించడం జరిగింది . అంతేకాకుండా షూటింగ్ కూడా మొదలైనట్లు తెలుపుతూ ఫోటోలు షేర్ చేసింది ‌. రాజు భజేవాలా టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీలో ఈ ముద్దుగుమ్మ కి జోడిగా చందన్ రాయ్ జంటగా నటిస్తున్నారు . బ్యాండ్ మ్యూజియం జీవిత కాదా ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి పలాష్ ముచ్చల్ దర్శకత్వం వహిస్తున్నారు .


అమన్ గుప్తా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ మధ్యప్రదేశ్లో మొదలవడం జరిగింది .
ఓటిటి చలనచిత్రంగా ఈ మూవీ రాబోతుంది ‌. ఇక ఇందులో అవిక ఓ పెళ్లయిన మహిళ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తుంది . ఈ విషయాన్ని వెల్లడిస్తూ .‌.. న్యూ బిగినింగ్స్ అంటూ రాసుకు వచ్చింది అవిక . దీంతో ఇది చూసిన ప్రేక్షకులు అమ్మడు పెళ్లి చేసుకుని హైమున్ కి వెళ్లి భర్తతో ఎంజాయ్ చేస్తుంది అనుకుంటే .. మళ్లీ సినిమాలు చేస్తుందని అసలు ఊహించుకోలేదు . సినిమాలపై ఉన్న ఇంట్రెస్ట్ ఏ దీనికి కారణం కావచ్చు . పెళ్లయినప్పటికీ సినీ ఇండస్ట్రీలో కష్టపడేందుకు ఇష్టపడుతుంది .. అంటు కామెంట్స్ చేస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: