రవితేజ ఇప్పుడు ఎంత పెద్ద స్టారో చెప్పనక్కర్లేదు.కానీ ఒకప్పుడు అవకాశాల కోసం ఈయన కూడా అందరిలాగే ఎన్నో ఇబ్బందులు పడ్డారట. ముఖ్యంగా హీరో అవుదామని వచ్చిన ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలుపెట్టారు. ఆ తర్వాత పలు సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు కూడా పోషించారు.అయితే రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్న సమయంలో కృష్ణవంశీ ఈయనకు సింధూరం మూవీలో హీరోగా చేసే అవకాశం ఇస్తారని తెలిపారట. దాంతో రవితేజ హీరో కాబోతున్నాను అని తెగ సంబరపడిపోయారట. అయితే అదే సమయంలో నెక్స్ట్ సినిమాలో హీరోగా తనని తీసుకుంటారో లేదో అనే అనుమానం రవితేజలో తలెత్తిందట. దానికి కారణం రవితేజతో కృష్ణవంశీ  సరిగ్గా మాట్లాడకపోవడమే. అదే సమయంలో కృష్ణవంశీ నాగార్జున టబూ కాంబినేషన్లో నిన్నే పెళ్ళాడుతా సినిమా షూట్ చేస్తున్నారు.

 అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో ఒక పాత్రలో చేసే వ్యక్తి రాకపోవడంతో వెంటనే రవితేజని పెట్టి షూటింగ్ కొనసాగిద్దాం అనుకున్నారు. అయితే ఇందులో రవితేజ ది నాగార్జునతో తన్నులు తినే క్యారెక్టర్.కాబట్టి తనకి నచ్చలేదట. హీరోగా చేయాల్సిన నేను ఇలాంటి పాత చేస్తే బాగుండదు. నేను చేయను అని చెప్పారట.దాంతో కృష్ణవంశీ కోపంతో ఇందులో యాక్టింగ్ చెయ్ బే లేకపోతే నెక్స్ట్ సినిమాలో నిన్ను హీరోగా తీసేస్తాను అంటూ వార్నింగ్ లాగా చెప్పారట. ఇక కృష్ణవంశీ అంత ఘాటు వార్నింగ్ ఇవ్వడంతో మళ్లీ నెక్స్ట్ మూవీ లో హీరోఛాన్స్ మిస్ అవుతానేమో నన్న భయంతో రవితేజ ఇష్టం లేకుండానే సరేలేరా చేస్తా అని అన్నారట.

అలా అయిష్టంగానే నిన్నే పెళ్లాడతా సినిమా షూటింగ్లో రవితేజ నటించారు. ఇక ఆ తర్వాత కూడా రవితేజకు కృష్ణవంశీ మీద నమ్మకం లేదట. సినిమాలో తీసుకుంటారు లేదో అని.కానీ కృష్ణ వంశీ మాత్రం రవితేజకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. సింధూరం మూవీలో బ్రహ్మాజీ తో పాటు హీరో పాత్రలో రవితేజను తీసుకున్నారు. అలా కృష్ణ వంశీ డైరెక్షన్లో వచ్చిన సింధూరం మూవీలో రవితేజ నటించి ఆయన కెరీయర్ ని మలుపు తిప్పుకున్నారు. రవితేజ కెరీర్ ని మార్చేసిన సినిమాల్లో సింధూరం మూవీ కూడా ఒకటి.

మరింత సమాచారం తెలుసుకోండి: