టాలీవుడ్ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. తన కెరియర్లో హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ ఉన్న   మెగా హీరో , సాయి దుర్గా తేజ్ 39వ పుట్టినరోజు సందర్భంగా తాను నటిస్తున్న సినిమాలకు సంబంధించి అప్డేట్ కోసం అభిమానులు చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. అలా సంబరాల ఏటిగట్టు సినిమాకు సంబంధించి తాజాగా గ్లింప్స్ విడుదల చేసింది చిత్ర బృందం.


గ్లింప్స్ టీజర్ విషయానికి వస్తే.. బాంబులు చూడుతూ, గాజు సీసాలను పొగలగొడుతూ కొంతమంది ఉండగా మరి కొంతమందిని దాహంతో అలమటిస్తున్నట్టు చూపించారు. సాయి దుర్గ తేజ్ ఎంట్రీ లుక్స్ అదిరిపోయేలా ఉన్నాయని చెప్పవచ్చు. ఇందులో పెద్దగా డైలాగ్స్ లేకపోయినా గ్లింప్స్ మాత్రం అభిమానులను మెప్పించినట్టు కనిపిస్తోంది. చివరిగా అసుర సంధ్య వేళ మొదలయ్యింది.. రాక్షసుల ఆగమనం అనే డైలాగ్ తో మరింత అంచనాలను పెంచేసింది సంబరాల ఏటిగట్టు గ్లింప్స్. ముఖ్యంగా కండలు తిరిగిన దేహంతో  సాయి ధరంతేజ్ మరింత ఆకట్టుకుంటున్నారని చెప్పవచ్చు.


ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రిలీజ్ డేట్ ని మాత్రం ప్రకటించలేదు. కానీ పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్లు చూపించారు. డైరెక్టర్ రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ కి జోడిగా ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్గా నటిస్తోంది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ సంబరాలు ఏటిగట్టు చిత్రంలో సరికొత్తగా కనిపించబోతున్నారు. మొత్తానికి బర్తడే రోజున అభిమానులకు మాత్రం అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. చివరిగా విరూపాక్ష సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు సాయి ధరమ్ తేజ్. మరి సంబరాలు ఏటి గట్టు సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: