
చిరంజీవి అనిల్ రావిపూడి కాంబో మూవీ నుంచి విడుదలైన 'మీసాల పిల్ల' సాంగ్ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కొందరు నెగిటివ్ కామెంట్లు చేస్తున్నప్పటికీ, ఎక్కువమందికి ఈ పాట నచ్చింది అనడంలో సందేహం లేదు. అయితే, ఈ పాట వింటుంటే సినిమాలో భార్యాభర్తల మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయని, ఈ సినిమా ఆ నేపథ్యంతో కూడిన కథ అని అర్థమవుతోంది. ఈ లీక్‌ను అనిల్ రావిపూడి కావాలనే ఇచ్చారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో మంచి పేరును సంపాదించుకున్న భీమ్స్, ఈ సినిమాతో అంతకు మించి ప్రశంసలు అందుకునే అవకాశం ఉంది. సంగీతపరంగా భీమ్స్ ఈ చిత్రానికి అందిస్తున్న కంటెంట్ అద్భుతంగా ఉందని, ఇది ఆయన కెరీర్‌లో మైలురాయిగా నిలిచే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. 'మీసాల పిల్ల' పాటలోని సాహిత్యం, సంగీతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మొత్తానికి, చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ మూవీపై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) మరియు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రానికి 'మన శంకర వర ప్రసాద్ గారు' అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమా చిరంజీవి కెరీర్‌లో 157వ చిత్రం కావడం విశేషం. నిల్ రావిపూడి శైలికి తగ్గట్టుగా ఇది ఒక ఫుల్ లెంగ్త్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని తెలుస్తోంది. చిరంజీవి స్వయంగా చెప్పినట్లుగా, ఈ కథనం 70 శాతం కామెడీ, 30 శాతం ఎమోషనల్ డ్రామా (Emotional Drama) కలగలిపి ఉంటుంది. భార్యాభర్తల మధ్య అభిప్రాయ బేధాలు, వాటి చుట్టూ నడిచే కథాంశం ఇందులో ప్రధానంగా ఉంటుందని 'మీసాల పిల్ల' పాట ద్వారా అర్థమవుతోంది. మెగాస్టార్ చిరంజీవి రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే. చిరంజీవి భారీ విజయాలు అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.