
అయితే ఇప్పుడు తాజాగా ఒక ఆసక్తికరమైన వీడియోను షేర్ చేసింది రేణూ దేశాయ్. తాజాగా ఈమె వేసుకున్న టీకా రెబిస్. ఈ వీడియోను రికార్డు చేసి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో మొదట అభిమానులు కొంతమేరకు ఆందోళన పడ్డ ఆ తర్వాత టీకాలు ప్రతి ఒక్కరు తీసుకోవాలనే అవగాహన కల్పించాలని ఉద్దేశంతోనే ఇలా చేశానంటూ తెలియజేసింది. తాను రెబిస్ టీకా తీసుకునేటప్పుడు చేసిన మొట్టమొదటి వీడియో రికార్డు ఇదే అంటూ తెలియజేసింది.
గతంలో ఏదైనా టీకా తీసుకున్నప్పుడు తాను ఫోటోలు లేదా వీడియోలు తీయాలని ఆలోచన ఎప్పుడు రాలేదని కానీ సమయానికి టీకా తీసుకోవడం చాలా ముఖ్యమని అందుకే ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయాలనిపించిందని తెలిపింది. ముఖ్యంగా జంతువులు పెంచే వ్యక్తులు, పశు వైద్యులు ఈ టీకాలను కచ్చితంగా మైంటైన్ చేయాలి అంటూ తెలిపింది. నిర్ణీత సమయానికి ఈ వ్యాక్సిన్లు తీసుకుంటున్నారో లేదో నిర్ధారించుకోవాలంటూ తెలియజేసింది రేణూ దేశాయ్. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రేణూ దేశాయ్ సినిమాల విషయానికి వస్తే .. తన కెరియర్లో బద్రి, జేమ్స్ పండు, జానీ లాంటి చిత్రాలలో తప్ప మరి సినిమాలలో నటించలేదు. అలాగే రాధమ్మ కూతురు అనే తెలుగు సీరియల్స్ లో నటించింది.