
అయితే ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో జరిగిన ఒక చిన్న సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు కారణమైంది. ఆ ఈవెంట్ కి యాంకర్ సుమ హోస్ట్ గా వ్యవహరించగా, ఆమె నరేష్‌ను సరదాగా ప్రశ్నించింది — “అమ్మాయిలను ఎలా పడేయాలి?” అని అడగ్గా. దానికి నరేష్ మరీ బోల్డ్ గా స్పందిస్తూ, “నేను అమ్మాయిలను సులభంగా పడేస్తాను. దానికోసం కొన్ని ట్రిక్స్ ఉన్నాయి, అవి ఫాలో అయితే చాలు!” అని సమాధానం ఇచ్చారు.
ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. కొందరు నెటిజన్లు దీనిని సరదాగా తీసుకున్నప్పటికీ, మరికొందరు మాత్రం అతనిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా, కొందరు నెటిజన్లు “అంటే నువ్వు పవిత్ర లోకేష్‌ని కూడా అలా పడేసావా?” అంటూ కామెంట్లు చేస్తున్నారు. దాంతో నరేష్ పేరు మళ్లీ ట్రోలింగ్ రేంజ్‌లోకి వెళ్లిపోయింది. అయితే మరోవైపు నరేష్ అభిమానులు మాత్రం ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. “వ్యక్తిగత జీవితం వేరు, ప్రొఫెషనల్ జీవితం వేరు. ఒక ఈవెంట్‌లో సరదాగా మాట్లాడిన మాటల్ని అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు” అంటూ ఆయనను సమర్థిస్తున్నారు. “నరేష్ చాలా టాలెంట్ ఉన్న నటుడు. వ్యక్తిగత జీవితంలో ఎవరికైనా సమస్యలు ఉండొచ్చు కానీ ఆయన నటన మాత్రం ఎప్పటికీ టాప్ క్లాస్‌గానే ఉంటుంది” అని ఆయన అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
తెలుగు సినిమా పరిశ్రమలో నరేష్–పవిత్ర లోకేష్ ల ప్రేమ వ్యవహారం అప్పట్లో ఎంత హాట్ టాపిక్ అయిందో మనందరికీ తెలిసిందే. ఆ సమయంలో ఆ జంటపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరిగింది. అప్పటి నుండి ఇప్పటికీ ఎడపాదపా ఈ ఇద్దరి పేర్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటాయి.ప్రస్తుతం కూడా నరేష్ మాట్లాడిన ఆ బోల్డ్ కామెంట్ కారణంగా ఆయన పేరు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. అయినప్పటికీ, ఆయనపై ఉన్న ప్రేమ, అభిమానం మాత్రం తగ్గలేదు. ఎప్పటికీ నవ్వుతూ, సరదాగా ఉండే నటుడు నరేష్ తన టాలెంట్‌తో తెలుగు ప్రేక్షకులను ఇంకా ఎన్నో ఏళ్లు అలరించబోతున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.