టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే — ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. అందం, నటన, గ్లామర్‌ — ఈ మూడు కలిపి ప్రేక్షకులను తనవైపుకు లాక్కుంటున్న స్టార్ హీరోయిన్. తెలుగు, తమిళం, హిందీ ఇలా పలు భాషల్లో సినిమాలు చేస్తూ ఎంతో క్రేజ్ సంపాదించుకున్నా, ఇటీవల కాలంలో మాత్రం తను ఊహించిన విజయాలు రాకపోవడంతో కొంత వెనుకబడిందని అనిపిస్తోంది. పూజా హెగ్డే కెరీర్ మొదటి రోజుల్లోనే ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. మొదటి కొన్ని సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో ఆమెను కొందరు “ఐరన్ లెగ్” అని పిలుస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు. కానీ పూజా మాత్రం ఆ మాటలను పట్టించుకోలేదు. ధైర్యంగా ముందుకు సాగి తన ప్రతిభతో ఒక్కొక్క అడుగు ముందుకేసింది. “అల వైకుంఠపురములో”, “అరవింద సమేత”, “మహర్షి” వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో స్టార్‌డమ్ సంపాదించింది.అయితే విజయం ఎప్పుడూ ఒకే దిశలో ఉండదు. కొన్ని హిట్స్ తర్వాత వరుసగా వచ్చిన కొన్ని ఫ్లాప్స్ పూజాను వెనక్కి నెట్టినట్టే కనిపించింది. కానీ పూజా మాత్రం దానికి భయపడలేదు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె తన ఫ్లాప్స్ గురించి స్పష్టంగా మాట్లాడింది.

“కెరీర్ ప్రారంభంలోనే అనేక పరాజయాలు ఎదురయ్యాయి. కానీ నేను ధైర్యంగా వాటిని ఎదుర్కొన్నాను. తర్వాత విజయాలు వచ్చాయి, స్టార్‌డమ్ దక్కింది. కానీ నిజమైన పరీక్ష విజయాలు లేని సమయంలోనే వస్తుంది. విజయాలు ఉన్నప్పుడు ప్రశంసించే వాళ్లు, ఫ్లాప్స్ వచ్చినప్పుడు వెనకనుంచి దెబ్బ కొట్టే వాళ్లు కూడా చాలామంది ఉంటారు. కానీ నేను వాటిని పెద్దగా పట్టించుకోను. నేను చేసిన తప్పులు ఏవో తెలుసుకుని వాటిని సరిదిద్దుకుంటూ ముందుకు సాగుతాను,” అని పూజా చెప్పింది.పూజా హెగ్డే చెప్పిన ఈ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ట్రోల్స్‌కు ధీటుగా సమాధానం ఇచ్చినట్టుగా అభిమానులు అభినందిస్తున్నారు.

“మీమ్స్, ట్రోల్స్ — ఇవి నన్ను ఒక్క క్షణం కూడా కదిలించలేవు. ఇవన్నీ తాత్కాలికం. నేను నా పనితోనే మాట్లాడతాను,” అని బోల్డ్‌గా ప్రకటించింది. ప్రస్తుతం పూజా చేతిలో కొన్ని భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో “కాంచన 4”  సినిమా షూటింగ్ దశలో ఉంది. అదనంగా, మరో రెండు పెద్ద సినిమాలు కూడా హోల్డ్‌లో ఉన్నట్లు సమాచారం. ఇండస్ట్రీ టాక్ ప్రకారం, వీటిలో ఏ రెండు సినిమాలు హిట్ అయినా, పూజా హెగ్డే మళ్లీ టాప్ లీగ్‌లోకి తిరిగి వస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

కొంతమంది సినీ ప్రముఖులు కూడా పూజాపై విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు —“పూజా ప్రతిభ, కట్టుబాటు, ప్రొఫెషనల్ అట్టిట్యూడ్ ఇవన్నీ ఆమెను మళ్లీ స్టార్ ర్యాంక్‌లో నిలబెడతాయి. ఈసారి ఆమె తిరిగి వస్తే, అది మరింత బలంగా ఉంటుంది,” అని విశ్లేషకులు అంటున్నారు.పూజా హెగ్డే ప్రస్తుతం తన రాబోయే సినిమాలపై పూర్తి నమ్మకంతో ఉన్నారు. “ఈసారి ఖచ్చితంగా మంచి కంబ్యాక్ ఇస్తాను. త్వరలోనే గుడ్ న్యూస్ వింటారు. నా పేరు మళ్లీ ఇండస్ట్రీలో గౌరవం తెచ్చుకుంటుంది,” అని ధీమాగా వెల్లడించింది.మొత్తానికి, పూజా హెగ్డే కెరీర్‌లోని పతనాలు, లేచే ధైర్యం, ఫ్లాప్స్‌కి లొంగకుండా ముందుకు సాగిన ఆత్మవిశ్వాసం ఇప్పుడు చాలామందికి ప్రేరణగా మారింది. కొందరు అయితే పూజా ని ట్రోల్ చేసిన వాళ్లకి ఘాటు గా ఇచ్చి పడేసింది అంటున్నారు. ఈ మీమ్‌స్ ట్రోల్స్ తన వెంట్రుక కూడా పీక లేవు అంటూ బోల్డ్ గా మాట్లాడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: