- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

బ‌న్నీ వాస్ సినిమా అంటే చాలు టాలీవుడ్‌లో ఇటీవ‌ల మంచి అంచ‌నాలు అంద‌రిలోనూ ఉంటున్నాయి. సినిమా చూసే ప్రేక్ష‌కులు, యూత్‌, ఎగ్జిబిట‌ర్లు, డిస్ట్రిబ్యూట‌ర్లు ఇలా ప్ర‌తి ఒక్క‌రిలోనూ బ‌న్నీ వాస్ నుంచి సినిమా వ‌స్తుందంటే మంచి న‌మ్మ‌కాలు ఉంటున్నాయి. పైగా మిత్ర‌మండ‌లి సినిమా ఫంక్ష‌న్‌లో ఆయ‌న చేసిన వెంట్రుక వ్యాక్య‌ల‌తో సినిమాలో ఖ‌చ్చితంగా ద‌మ్ము ఉంటుంద‌ని.. లేక‌పోతే బ‌న్నీ వాస్ అంత పెద్ద మాట‌లు మాట్లాడ‌ర‌నే అంద‌రూ భావించారు. కానీ సినిమా లెక్క త‌ప్పేసింది. సినిమాకు ఎంత బ‌న్నీ వాస్ లాంటి స‌పోర్ట్ చేసే నిర్మాత ఉన్నా.. ఎంత మంచి ఆర్టిస్టులు ఉన్నా.. వారి బలాబలాలను గమనించి కథ, కథనాలు నడపకపోతే సినిమా బొక్క బోర్లా ప‌డ‌డం గ్యారెంటీయే. మిత్ర‌మండ‌లి సినిమా విషయంలో అదే జరిగింది.


ప్రతి దర్శకుడు అనుదీప్ ‘జాతిరత్నాలు’ను స్ఫూర్తిగా తీసుకుని సినిమాలు చుట్టేస్తు పోతుంటే ప‌ని కాదు. జాతిర‌త్నాలు సినిమాకు నవీన్ పోలిశెట్టి ఉండటమే పెద్ద ప్లస్. ఆ తర్వాత వచ్చిన అనుదీప్ సినిమాలు ఎందుకు ఆకట్టుకోలేక పోయాయో ఎవరూ అర్థం చేసుకోవడం లేదు. అందుకే దర్శకుడు విజయేందర్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది అనుకోవాలి. ఈ సినిమాలో  ప్రియ‌ద‌ర్శి రెండు నిమిషాల పాటు ఆపకుండా  డైలాగ్ చెబుతుంటే  ఓ పాత్ర ‘ఏంటిది’ అని అడుగుతూ ఉంటుంది. వెంట‌నే క‌మెడియ‌న్ స‌త్య అందుకుని...
‘సోది.. వాళ్లేమో సోది నా కొడుకులు ’ అంటాడు. ఈ డైలాగ్ రెండుగంటల సినిమాకీ వర్తిస్తుంద‌న్న సెటైర్లు వినిపిస్తున్నాయంటే మిత్ర‌మండ‌లి సినిమా ఎలా ఉందో ఇంత‌క‌న్నా ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

 
ఇక ఈ సినిమాకు స‌మ‌ర్ప‌కుడిగా ఉన్న నిర్మాత బన్నీ వాసు ప్రి రిలీజ్ ఈవెంట్లో తనను, తన సినిమాను తొక్కేయడానికి కొందరు నెగటివ్ ట్రోలింగ్ చేస్తున్నారని ... వాళ్లు నా వెంట్రుక పీక‌లేరంటూ త‌ల వెంట్రుక చూపించారు. నేను వేరే వెంట్రుక చూపించ‌వ‌చ్చ‌ని.. కానీ సంస్కారంతో త‌ల వెంట్రుక చూపిస్తున్నానంటూ కామెంట్ చేశారు. అయితే మిత్ర మండ‌లి సినిమా చూశాక అస‌లు ఈ సినిమాకు అంత సీన్ లేద‌ని బ‌న్నీ వాస్‌కే అర్థ‌మై ఇలా ఓవ‌ర్‌గా రియాక్ట్ అయ్యారా ? అనిపించ‌క మాన‌దు.

మరింత సమాచారం తెలుసుకోండి: