టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఓ రికార్డు విషయం లో టాప్ 5 మూవీస్ లలో అన్నీ కూడా మెగా హీరోస్ సినిమాలే ఉన్నాయి. ఆ రికార్డు ఏమిటి అనేది తెలుసుకుందాం.

టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఇప్పటివరకు విడుదల అయిన లిరికల్ వీడియో సాంగ్ లలో విడుదల అయిన 24 గంటలలో అత్యధిక వ్యూస్ ను సాధించిన సాంగ్స్ లలో టాప్ 5 లో 5 కూడా మెగా హీరోస్ నటించిన సినిమా సాంగ్స్ ఉన్నాయి. ఆ సాంగ్స్ ఏవి ..? ఏ స్థానాలలో ఏ మూవీ సాంగ్స్ నిలిచాయి అనే విషయాలను తెలుసుకుందాం.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందిన పుష్ప పార్ట్ 2 మూవీలోని కిస్సిక్ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ కి విడుదల అయిన 24 గంటల సమయంలో 27.19 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందిన గేమ్ చెంజర్ మూవీలోని నానా హైరానా మూవీ లిరికల్ వీడియో సాంగ్ కి విడుదల ఆయన 24 గంటల్లో 23.44 మిలియన్ వ్యూస్ దక్కాయి.

రామ్ చరణ్ హీరోగా రూపొందిన గేమ్ చేంజర్ మూవీ లోని దోప్ అంటే సాగే సాంగ్ కి విడుదల అయిన 24 గంటల్లో 21.27 మిలియన్ వ్యూస్ దక్కాయి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన హరిహర వీరమల్లు మూవీ లోని అసుర హరణం అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ కి విడుదల ఆయన 24 గంటల్లో 19.93 మిలియన్ వ్యూస్ దక్కాయి.

పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన హరిహర వీరమల్లు మూవీ లోని మాట వినని సాంగ్ కి విడుదల అయిన 24 గంటల్లో 19.51 మిలియన్ వ్యూస్ దక్కాయి.

ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీ లో విడుదల అయిన 24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను సాధించిన టాప్ 5 లిరికల్ వీడియో సాంగ్ లలో ఐదు కూడా మెగా హీరోస్ మూవీ సాంగ్స్ ఉండడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: