టాలీవుడ్లో లక్కీ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సంయుక్త మీనన్ గురించి చెప్పాల్సిన పని లేదు. తెలుగులో భీమ్లా నాయక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మలయాళ ముద్దుగుమ్మ ఆ తర్వాత బింబిసారా, సార్, డెవిల్ వరుస చిత్రాలతో సక్సెస్ అందుకుంది ప్రస్తుతం పలు రకాలు చిత్రాలతో పాటు అఖండ 2 చిత్రంలో కూడా నటిస్తోంది. అయితే మొదటిసారిగా ఒక ఫిమేల్ సెంట్రిక్ సినిమాలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. చింతకాయలరవి ఫేమ్ యోగేష్ కేఎంసి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి ది బ్లాక్ గోల్డ్ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.


ఇందుకు సంబంధించి అఫీషియల్ గా చిత్ర బృందం దీపావళి రోజున ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది. అయితే ఈ పోస్టర్ చాలా ఇంట్రెస్టింగా కనిపిస్తున్నట్లు ఉంది. సంయుక్త తుపాకీ పట్టుకొని తెల్లటి టీ షర్టు మరియు ఆమె చేతి పైన రక్తపు మరకలు కనిపిస్తూ, గుట్టలు గుట్టలుగా ఉన్న శవాల మధ్య నిలబడి, రైల్వే ప్లాట్ఫారం మీద ఉన్నట్లుగా కనిపిస్తోంది. అలాగే సంయుక్త లుక్స్ కూడా చాలా సీరియస్ గా ఉన్నట్లు కనిపించడమే కాకుండా ఆమె చుట్టూ వాతావరణ ఏదో గందరగోళంగా, భయానకరంగా ఉన్నట్లు చూపించారు పోస్టర్లో, అయితే ఈ లుక్ లో సంయుక్త ని చూసిన అభిమానుల ఆశ్చర్యపోతున్నారు.


గతంలో నటించిన పాత్రల కంటే బ్లాక్ గోల్డ్ సినిమాలో  విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నట్లు కనిపిస్తోంది.పోస్టర్ ను బట్టి చూస్తూ ఉంటే ఈ సినిమా రా యాక్షన్ డ్రామా సినిమాగా ఉండబోతున్నట్లుగా కనిపిస్తోంది. ఇదివరకు చూడని ఒక బోల్డ్ అవతార్ పాత్రలో సంయుక్త ని చూపించబోతున్నట్లు తెలుస్తోంది డైరెక్టర్ యోగేష్. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్  హైదరాబాదులో శరవేగంగా జరుగుతోంది. అలాగే ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్ ,కన్నడ,మలయాళం హిందీ వంటి భాషలలో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే ఈమె చేతిలో 8 సినిమాలు ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: