తమిళ నటుడు మరియు దర్శకుడు అయినటువంటి ప్రదీప్ రంగనాథన్ ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలను తమిళ్ తో పాటు తెలుగు లో కూడా పెద్ద ఎత్తున విడుదల చేస్తూ వస్తున్నారు. ప్రదీప్ కొంత కాలం క్రితం లవ్ టుడే అనే సినిమాలో హీరోగా నటించి ఆ సినిమాకు దర్శకత్వం కూడా వహించాడు. ఆ సినిమాను తెలుగులో విడుదల చేయగా ఈ మూవీ తెలుగు బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. అలాగే ప్రదీప్ హీరోగా రూపొందిన డ్రాగన్ సినిమాను కూడా తెలుగులో విడుదల చేశారు. ఆ మూవీ కూడా తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది. తాజాగా ఈయన హీరోగా నటించిన డ్యూడ్ మూవీ ని కూడా తెలుగు లో విడుదల చేశారు. ఈయన నటించిన సినిమాలు వరుసగా తెలుగు బాక్సా ఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను వసూలు చేస్తూ రావడంతో ఈయన తాజాగా నటించిన డ్యూడ్ మూవీ యొక్క రెండు తెలుగు రాష్ట్రాల హక్కులను భారీ ధరకు కొనుగోలు చేశారు.

ఇక ఈ మూవీ కి తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే మంచి టాక్ వచ్చినా కూడా ఇతర సినిమాలతో భారీ పోటీ ఉండడంతో ఈ మూవీ కి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద స్థాయిలో కలెక్షన్లు దక్కడం లేదు. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన ఐదు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ ఐదు రోజుల్లో ఈ సినిమాకు నైజాం ఏరియాలో 3.73 కోట్ల కలెక్షన్లు దక్కగా ,  సిడెడ్ లో 83 లక్షలు , ఆంధ్ర లో 3.12 కోట్ల కనెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఐదు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ మూవీ కి 7.68 కోట్ల షేర్ ... 13.55 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల ప్రీ రిలీజ్ బిసినెస్ జరగగా ... ఈ మూవీ 11 కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో హిట్ స్టేటస్ను అందుకోవాలి అంటే మరో 3.32 కోట్ల కలెక్షన్లను రాబట్టవలసి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: