టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం సినిమాల రీ రిలీజ్ ల పర్వం జోరుగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే, భారతీయ సినిమా చరిత్రలో మైలురాయిగా నిలిచిన 'బాహుబలి ది బిగినింగ్' సినిమా 'ది ఎపిక్ రీలీజ్' పేరుతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా రీ-రిలీజ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అక్టోబర్ 31వ తేదీన ఈ భారీ చిత్రం మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన బుకింగ్స్ అద్భుతంగా ఉన్నట్లు సమాచారం. అదే సమయంలో రవితేజ నటించిన 'మాస్ జాతర' సినిమా కూడా విడుదల కానున్న సంగతి తెలిసిందే. 'బాహుబలి ది బిగినింగ్' చిత్రం బుక్ మై షోలో దాదాపు 3 లక్షల మంది లైక్స్ దక్కించుకోవడం విశేషం. ఈ స్పందన చూస్తుంటే, బాక్సాఫీస్ వద్ద 'బాహుబలి ది ఎపిక్ రీలీజ్' మరోసారి మ్యాజిక్ చేయడం ఖాయమని సినీ విశ్లేషకులు కామెంట్లు చేస్తున్నారు.
ఇక నవంబర్ నెల 14వ తేదీన టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్లలో ఒకటైన 'శివ' సినిమా కూడా రీ-రిలీజ్ కానుంది. అప్పట్లో ఈ సినిమా సృష్టించిన సంచలనాలు, యువతపై దాని ప్రభావం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'శివ' ట్రైలర్ కట్‌కు అల్లు అర్జున్ వీడియోను యాడ్ చేసి విడుదల చేయగా, ఈ వీడియోకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. 'శివ' సినిమా రీ-రిలీజ్ కూడా ట్రెండ్ సెట్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ రెండు భారీ రీ-రిలీజ్ సినిమాలు కలెక్షన్ల విషయంలో ఏ స్థాయిలో రికార్డులు క్రియేట్ చేస్తాయో చూడాల్సి ఉంది. తెలుగు సినీ చరిత్రలో రీ-రిలీజ్‌ల ట్రెండ్ ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.
ఈ రెండు సినిమాలు రీ రిలీజ్ లో కూడా సంచలన విజయాలను సొంతం చేసుకుంటే రాబోయే రోజుల్లో సినిమాల రే రిలీజ్ దిశగా అడుగులు పడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. టాలీవుడ్ ఇండస్ట్రీ రీ రిలీజ్ సినిమాలతో సైతం రికార్డులు క్రియేట్ చేయాలని అభిమానులు భావిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి