తమిళ సినీ పరిశ్రమలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన స్టార్ హీరోలలో సూపర్ స్టార్ రజనీ కాంత్ ఒకరు. రజనీ కాంత్ ఇప్పటివరకు ఎన్నో విజయవంతమైన సినిమాలలో హీరో గా నటించి తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరో స్థాయికి ఎదగడం మాత్రమే కాకుండా ఇండియా వ్యాప్తంగా గొప్ప గుర్తింపును కూడా సంపాదించుకున్నాడు. రజనీ కొంత కాలం క్రితం కూలీ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. లోకేష్ కనకరాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ రాలేదు. దానితో ఈ సినిమా భారీ స్థాయి కలెక్షన్లను వసూలు చేయడంలో విఫలం అయింది. ప్రస్తుతం రజిని , నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. జైలర్ మూవీ మంచి విజయం సాధించడంతో జైలర్ 2 సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇకపోతే రజిని నెక్స్ట్  మూవీ కి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... రజినీ తన తదుపరి మూవీ ని తమిళ సినీ పరిశ్రమలో దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న సుందర్ సి దర్శకత్వంలో చేయబోతున్నట్లు తెలుస్తోంది.

మరి రజిని నిజం గానే సుందర్ సి దర్శకత్వంలో సినిమా చేస్తాడా ..? లేదా ..? అనేది తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. ఇకపోతే రజిని , కమల్ హాసన్ తో కలిసి ఓ సినిమా చేయబోతున్నట్లు కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. మొదట రజనీ , కమల్ కాంబో మూవీ కి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం రజనీ , కమల్ కాంబో మూవీ ని నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వ వహించే ఛాన్సెస్ ఉన్నాయి అని ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: