కేజిఎఫ్ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా తన పేరు వినిపించేలా చేశారు హీరో యష్. ఆ తర్వాత కేజిఎఫ్ 2 సినిమాతో భారీ క్రేజ్ అందుకున్నారు. యష్ తదుపరి సినిమా ఎలా ఉంటుందనే విషయంపై కన్నడ ఆడియన్స్ మాత్రం చాలా ఎక్సైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే టాక్సిక్ అనే చిత్రంలో నటించబోతున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ గీతు మోహన్ దాస్ దర్శకత్వం వహించగా ఈ సినిమా మొదలుపెట్టినప్పటి నుంచే ఎన్నో ఇబ్బందులలో చిక్కుకుంది. ఈ సినిమాకి సంబంధించి షూట్ విషయంలో యష్ జోష్యం చేసుకున్నారనే వార్తలు ఎక్కువగా వినిపించాయి.


అవుట్ ఫుట్ నచ్చకపోవడంతో తిరిగి మళ్లీ రీ షూట్ చేయాల్సింది అన్నట్లుగా యష్ కోరినట్లుగా వార్తలు వినిపించాయి. ఈ చిత్రానికి సంబంధించి సినిమా ప్రొడక్షన్ ఇష్యూలో కూడా ఇబ్బందులు ఏర్పడ్డాయని, వాస్తవానికి డైరెక్టర్ మోహన్ దాస్ చాలా విభిన్నంగా సినిమాలను తెరకెక్కిస్తుంటారు. అలాంటి డైరెక్టర్ కి హీరో యష్ ఇమేజ్ తోడైతే కచ్చితంగా నెక్స్ట్ లెవెల్ లో సినిమా ఉంటుందనే విధంగా అభిమానులు భావించారు. కానీ ఈ సినిమా కథను కొత్తగా ట్రై చేస్తున్నారేమో అని అందరూ భావించినప్పటికీ ఈ సినిమా షూట్ చేసిన తర్వాత ఫుటేజ్ మాత్రం హీరోకి నచ్చడం  లేదట.


ఈ చిత్రంలో తనని ఇంకా మాస్ కంటెంట్ తో చూపించాలని, అప్పుడే అభిమానులు సాటిస్ఫై అయ్యే అవకాశం ఉందనే విధంగా కోరారట యష్. ఈ చిత్రాన్ని కెవిన్ ప్రొడక్షన్ బ్యానర్ పైన నిర్మిస్తున్నారు. ఈ సినిమా మార్చి 9న వచ్చేయేడానికి రిలీజ్ చేయబోతున్నామని ప్రకటించినప్పటికీ, కానీ హీరో యష్, డైరెక్టర్ గీతు మధ్య డిఫరెన్సెస్ వల్ల ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ కావడం కష్టమే అన్నట్లుగా వినిపిస్తున్నాయి. అందుకే అదే రోజున హీరో అడవి శేషు నటిస్తున్న డెకాయిట్ చిత్రం  రిలీజ్ చేయబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి టాక్సిస్ సినిమా పోస్ట్ పోన్ పై ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: