మాస్ మహారాజా రవితేజ గత కొంత కాలంగా వరుస అపజయాలతో డీలా పడిపోయి ఉన్న విషయం మన అందరికి తెలిసిందే. ఆఖరుగా రవితేజ కు ధమాకా అనే సినిమాతో విజయం దక్కింది . ఈ సినిమా తర్వాత ఈయన చాలా సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు . కానీ ఈయనకు మంచి విజయం మాత్రం ఆ సినిమా తర్వాత దక్కలేదు. తాజాగా రవితేజ "మాస్ జాతర" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా నవంబర్ 1 వ తేదీన విడుదల అయింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో లను అక్టోబర్ 31 వ తేదీన సాయంత్రం నుండే ప్రదర్శించారు. ఈ మూవీ కి కూడా నెగిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా కూడా పెద్ద స్థాయి కలెక్షన్లను బాక్సా ఫీస్ దగ్గర వసూలు చేయలేక పోతుంది. రవితేజ మాత్రం హిట్టు , ఫ్లాపులను ఏ మాత్రం పట్టించుకోకుండా తన తదుపరి సినిమాపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

అసలు విషయం లోకి వెళితే ... రవితేజ ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇక మాస్ జాతర సినిమా విడుదల అయ్యి ఎక్కువ రోజులు కాక ముందే రవితేజ , కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రవితేజ , కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు సంబంధించిన సాంగ్ షూటింగ్లో పాల్గొంటున్నట్లు , అన్నపూర్ణ స్టూడియోలో ఈ సాంగ్ చిత్రీకరణ జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని ఈ వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాతో అయినా రవితేజ హిట్ కొట్టి ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rt