‍ ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

హారర్ కామెడీ జానర్‌కి కొత్త నిర్వచనం ఇచ్చిన దర్శకుడు, నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్‌ మళ్లీ తన సూపర్‌హిట్ సిరీస్‌ ‘కాంచన’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటివరకు వచ్చిన మూడు భాగాలు ముని, కాంచన, కాంచన 2, కాంచన 3 బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలు సాధించాయి. ఇప్పుడు ఆ విజయ పరంపరను కొనసాగిస్తూ లారెన్స్‌ “కాంచన 4”ను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. లారెన్స్ తన సిగ్నేచర్ స్టైల్ హారర్ కామెడీతో పాటు, భావోద్వేగాలను కూడా మేళవించి తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ సారి కథ మరింత భారీ స్థాయిలో, కొత్త స్థాయిలో విజువల్ ట్రీట్‌గా ఉండబోతోందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. కాంచన సిరీస్ అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.


కాంచన 4 ’ ఇంకా థియేటర్లకు రాకముందే బిజినెస్ పరంగా సంచలనాలు సృష్టిస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన డిజిటల్ హక్కులు రూ. 50 కోట్లకు, అలాగే హిందీ రీమేక్ హక్కులు మరో రూ.50 కోట్లకు అమ్ముడయ్యాయని సమాచారం. అంటే రిలీజ్‌కి ముందే వంద కోట్ల బిజినెస్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇది లారెన్స్ బ్రాండ్ పవర్‌కి నిదర్శనం. ఈ సినిమా లో పూజా హెగ్డే, నోరా ఫతేహి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీరిద్దరి గ్లామర్‌, లారెన్స్ ఎనర్జీ, హారర్ కామెడీ మేళవింపు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండబోతోందని టాక్. ముఖ్యంగా నోరా ఫతేహి స్పెషల్ సాంగ్‌పై భారీ ఖర్చుతో షూట్ చేస్తున్నారట.


ఇంత భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న “ కాంచన 4 ” రాబోయే ఏడాది సమ్మర్‌లో విడుదల కానుంది. ఇప్పటికే ఫస్ట్ లుక్‌, మేకింగ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో, లారెన్స్ మళ్లీ తన మ్యాజిక్‌ను చూపించబోతున్నాడనే నమ్మకం అభిమానుల్లో పెరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: