అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే — ఈ తేదీని ఎందుకు ఎంచుకున్నారన్నది! ఎందుకంటే ఫిబ్రవరి 26 అనే ఈ రోజు వీరి జీవితంలో ప్రత్యేకమైన జ్ఞాపకాన్ని కలిగి ఉంది. రిపోర్ట్స్ ప్రకారం, ఇదే తేదీన రష్మిక మరియు విజయ్ తొలిసారి ఒకరిని ఒకరు కలిశారట. అప్పట్లో వీరిద్దరూ కలిసి నటించిన ‘గీత గోవిందం’ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే ముందు, లుక్ టెస్ట్ కోసం దర్శకుడు పరశురామ్ ఇద్దరినీ స్టూడియోకు పిలిచారట. ఆ లుక్ టెస్ట్ సమయంలోనే మొదటిసారి రష్మిక, విజయ్ ఒకరితో ఒకరు మాట్లాడి పరిచయం అయ్యారట. అదే రోజే ఈ ఇద్దరి మధ్య మొదటి స్పార్క్ ఏర్పడిందని, ఆ రోజు వీరిద్దరి జీవితాన్ని మార్చేసిందని అంటున్నారు. వీరిద్దరి కెమిస్ట్రీ ఆ తర్వాత గీతగోవిందం సినిమాలో అదుర్స్‌గా కనపడటానికి కారణం కూడా అదే అనిపిస్తుంది. షూటింగ్ సమయంలో పెరిగిన స్నేహం క్రమంగా బంధంగా మారి, ప్రేమగా మారింది. చివరికి ఈ ప్రేమ బంధం ఇప్పుడు వివాహం దిశగా వెళ్లడం అభిమానులను ఎంతో ఆనందపరిచే విషయమే.
ఇప్పుడు వీరు తమ జీవితంలో తొలి పరిచయమైన ఆ ఫిబ్రవరి 26 తేదీని ఎప్పటికీ గుర్తుండేలా చేసుకోవాలనే ఉద్దేశ్యంతో అదే రోజు పెళ్లి ముహూర్తం ఎంచుకున్నారని తెలుస్తోంది. ఈ జ్ఞాపక దినాన్ని జీవితాంతం ఒక అందమైన బంధంతో ముద్రవేయాలనుకోవడం ఎంత రొమాంటిక్‌గా ఉందో చెప్పలేం.ఇక అధికారిక ప్రకటన ఇంకా వెలువడకపోయినా, అభిమానులు సోషల్ మీడియాలో ఈ వార్తను సంబరంగా పంచుకుంటున్నారు. “గీతగోవిందం మొదలైన రోజు జీవితాంతం ప్రేమకథగా మారింది” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఎలా చూసినా, ఫిబ్రవరి 26 తేదీ ఇప్పుడు టాలీవుడ్‌లోనే కాకుండా అభిమానుల హృదయాల్లో కూడా ప్రత్యేకమైన రోజుగా నిలిచిపోనుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి