వారి కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత విషయాలను ఇంత బహిరంగంగా, అబద్ధాలతో నింపి ప్రచారం చేయడం సహించలేమని మెగా ఫ్యామిలీ వర్గాలు మండిపడుతున్నయ్. ఇప్పటికే రామ్ చరణ్ టీమ్ ఆ రూమర్స్ పుట్టించిన సోషల్ మీడియా అకౌంట్స్‌ను గుర్తించే ప్రక్రియ ప్రారంభించిందట. తప్పుడు సమాచారం పంచినవారిపై చట్టపరమైన చర్యలు (లీగల్ యాక్షన్) తీసుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని దగ్గరి వర్గాల సమాచారం. ఇకపై ఎవరు అయినా రామ్ చరణ్, ఉపాసన లేదా మెగా కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత అంశాలపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం, తప్పుడు వార్తలు రాయడం లేదా వీడియోలు తయారు చేయడం చేస్తే వారికి కఠినమైన లీగల్ నోటీసులు ఇవ్వాలని మెగా ఫ్యామిలీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
సోషల్ మీడియా ఒక వేదిక మాత్రమే కానీ దాన్ని వ్యక్తిగత జీవితాలపై దాడి చేసే ఆయుధంగా మార్చకూడదని, ఒక స్టార్ హీరో కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని నిందారోపణలు చేయడం చాలా బాధాకరమని రామ్ చరణ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలోనే ఆ రూమర్స్‌పై రామ్ చరణ్ టీమ్ అధికారిక క్లారిఫికేషన్ మరియు లీగల్ స్టేట్‌మెంట్ విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి