కన్నడ నటుడు మరియు దర్శకుడు అయినటువంటి రిషబ్ శెట్టి తాజాగా హీరో గా నటించి దర్శకత్వం వహించిన కాంతారా చాప్టర్ 1 అనే సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన విషయం మన అందరికి తెలిసిందే. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన 35 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ 35 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ఎన్ని కలెక్షన్లు వచ్చాయి. ఈ సినిమాకు ఇప్పటివరకు ఎన్ని కోట్ల లాభాలు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.

35 రోజుల్లో ఈ సినిమాకు కర్ణాటక ఏరియాలో 244.80 కోట్ల కలెక్షన్లు దక్కగా , రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి 106.70 కోట్ల కలెక్షన్లు దక్కాయి. తమిళనాడు ఏరియాలో 71.75 కోట్ల కలెక్షన్లు దక్కగా , కేరళ లో 55.68 కోట్ల కలెక్షన్లు దక్కాయి. హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో కలుపుకొని 251.20 కోట్ల కలెక్షన్లు దక్కగా , ఓవర్ సిస్ లో 110.55 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 35 రోజుల్లో కలిపి 409.20 కోట్ల షేర్ ... 840.68 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 340 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 342 కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఇక ఇప్పటివరకు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని 67.20 కోట్ల లాభాలను అందుకుంది. ఇలా ఈ మూవీ ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్లను వసూలు చేసి మంచి లాభాలను అందుకుంది. ఈ మూవీ లో రిషబ్ శెట్టి కి జోడీగా రుక్మిణి వసంత్ నటించింది. ఈ మూవీ లోని రిషబ్ శెట్టి , రుక్మిణి వసంత్ నటనలకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: