సినిమా ఇండస్ట్రీ లో మంచి విజయాలు దక్కిన వారికి మంచి సినిమా అవకాశాలు కూడా వస్తాయి అనే వాదనను అనేక మంది వినిపిస్తూ ఉంటారు. కానీ కొంత మంది విషయంలో మాత్రం ఇది రాంగ్ అని ప్రూవ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇకపోతే ఓ ముద్దుగుమ్మ ఇప్పటివరకు చాలా సినిమాల్లో హీరోయిన్గా నటించింది. ఈమె హీరోయిన్గా నటించిన సినిమాల్లో తన నటన కంటే కూడా అందంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సందర్భాలు అనేకం. ఈమె నటించిన సినిమాల సంఖ్య బాగానే ఉన్నప్పటికి అందులో విజయాల సంఖ్య మాత్రం చాలా తక్కువగా ఉంది.

కానీ ఈమెకు వరుస పెట్టి క్రేజీ హీరోల సినిమాలలో , స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు మాత్రం బాగానే దక్కుతున్నాయి. ఇంతకు ఆ ముద్దుగుమ్మ ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె మరెవరో కాదు నీది అగర్వాల్. ఈ బ్యూటీ సవ్యసాచి అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. కానీ ఈ సినిమాలో ఈమె తన అందంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత కూడా ఈమె పలు సినిమాలలో నటించింది. ఈమెకు తెలుగులో ఈస్మార్ట్ శంకర్ మూవీ ద్వారా మంచి విజయం దక్కింది. ఈ మూవీ తర్వాత కూడా ఈమె చాలా సినిమాలలో నటించింది.

కానీ ఈమెకు మంచి విజయాలు మాత్రం దక్కలేదు. కొంత కాలం క్రితం ఈమె హరిహర వీరమల్లు అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ రాజా సాబ్ అనే సినిమాలో హీరయిన్గా నటిస్తుంది. ఈ సినిమాను ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. ఈ మూవీతో ఈ ముద్దుగుమ్మకు ఎలాంటి విజయం తక్కుతుందో చూడాలి. ఇలా ఈమెకు విజయాలు పెద్దగా లేకపోయినా క్రేజీ హీరోల సినిమాలలో , స్టార్ హీరోల సినిమాలలో మాత్రం అవకాశాలు బాగానే దక్కుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: