ఇదిలా ఉండగా, ఈ రోజు ఉదయం జక్కన్న అభిమానులకు ఊహించని గిఫ్ట్ ఇచ్చారు. ‘SSMB 29’లో ప్రముఖ మలయాళీ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రాజమౌళి తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ద్వారా భారీ అప్‌డేట్‌ను షేర్ చేశారు. రాజమౌళి పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఆ లుక్ చూస్తే అభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. పృథ్వీరాజ్ పాత్ర ‘కుంభ’ – ఒక క్రూరమైన, దుష్ట, శక్తివంతమైన విలన్‌గా కనిపించబోతున్నారు. రోబోటిక్ చైర్‌లో కూర్చుని ఉండగా, వెనుక రోబోటిక్ హ్యాండ్స్ విరాజిల్లుతున్న అద్భుతమైన డిజైన్ ఆ లుక్‌కి ఒక ఫ్యూచరిస్టిక్ టచ్ ఇచ్చింది. బ్యాక్‌డ్రాప్‌లో కనిపించే ఆఫ్రికన్ అడవుల వాతావరణం, వాటర్ ప్లాంట్స్ మధ్యలో ఆ సీన్ సెట్ కావడం విజువల్‌గా ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తోంది.
అందరినీ ఆకట్టుకునే ఈ ఫస్ట్ లుక్‌పై రాజమౌళి కూడా తన ఎమోషన్ షేర్ చేశారు – “పృథ్వీరాజ్‌తో మొదటి షాట్ షూట్ చేసిన తర్వాత నేను అతని దగ్గరకు వెళ్లి, ‘మీరు నాకు తెలిసిన అత్యుత్తమ నటుల్లో ఒకరు’ అని చెప్పాను. ఈ దుష్టమైన, క్రూరమైన, శక్తివంతమైన విరోధి ‘కుంభ’ పాత్రకు ప్రాణం పోయడం సృజనాత్మకంగా నాకు చాలా సంతృప్తి ఇచ్చింది. తన కుర్చీలో పూర్తిగా ఒదిగిపోయినందుకు పృథ్వీకి ధన్యవాదాలు.” అని రాసుకొచ్చారు జక్కన్న. ఈ లుక్ చూసిన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫుల్ హైప్‌లో ట్రెండ్ అవుతుంది. “ఇంత ఇంటెన్సివ్‌గా, వైలెంట్‌గా ఉన్న లుక్ ఏం లెవల్‌లో ఉందో!” అంటూ నెట్‌లో రియాక్షన్స్ వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పుడు అందరి దృష్టి మహేష్ బాబు ఫస్ట్ లుక్‌పై పడింది. పృథ్వీరాజ్ లుక్ గూస్‌బంప్స్ తెప్పిస్తుంటే, హీరో మహేష్ ఎలా కనిపించబోతారో తెలుసుకోవాలని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. SSMB 29– మహేష్ బాబు కెరీర్‌లోనే కాకుండా, ఇండియన్ సినిమా చరిత్రలో కొత్త అధ్యాయాన్ని రాసే ప్రాజెక్ట్‌గా మారబోతుందనే నమ్మకం అభిమానుల్లో నెలకొంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి