పాన్ ఇండియా లెవెల్లో ప్రస్తుతం ప్రభాస్ సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే. అలాంటి లిస్టులో డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్షన్లో ఫౌజీ కూడ ఒకటి.ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా విడుదల చేయగా అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఈ సినిమా పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో సెకండ్ వరల్డ్ వార్ నేపథ్యంలో తెరకెక్కించబోతున్నట్లు వినిపిస్తున్నాయి. దీంతో ఈ చిత్రం పైన మరింత అంచనాలు పెంచేసేలా కనిపిస్తున్నాయి. తాజాగా వినిపిస్తున్న మరొక విషయంతో ప్రభాస్ కెరియర్ లోనే ఈ సినిమా బెస్ట్ సినిమాగా అవుతుందట.


తాజాగా వినిపిస్తున్న ప్రకారం ప్రభాస్సినిమా అవుట్ ఫుట్ పట్ల చాలా హ్యాపీగా ఉన్నారని, ప్రభాస్ తన కెరియర్ లోనే ఇందులో చాలా కొత్తగా కనిపించబోతున్నారట. ముఖ్యంగా ఈ సినిమాలోని సీన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని ఒక్కో ఫ్రేమ్ చాలా అద్భుతంగా డైరెక్టర్ హనురాఘవపూడి తీర్చిదిద్దారని తెలుస్తోంది. పాటలు కూడా ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా ఉంటాయని ప్రభాస్ అభిమానులే కాకుండా ఇతర హీరో అభిమానులు కూడా పౌజీ సినిమాకి ఫిదా అవుతారట. అంత అద్భుతంగా తీశారని వినిపిస్తున్నాయి.


పౌజీ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతోంది.ఇక్కడ షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత మైసూర్లో కొత్త షెడ్యూల్ ని మొదలుపెట్టేలా చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్ కి జోడిగా ఇమాన్వీ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రంతోనే మొదటిసారిగా ఇమే తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. వచ్చే ఏడాది ఆగస్టులో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేశారు. ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే.. కల్కి 2, సలార్ 2, స్పిరిట్  ది రాజా సాబ్  వంటి చిత్రాలు  ఉన్నాయి. ఇందులో రాజా సాబ్ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: