బాలీవుడ్లో స్టార్ హీరోగా పేరు సంపాదించిన షారుక్ ఖాన్ గురించి , ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. షారుక్ ఖాన్ బర్త్ డే సందర్భంగా(నవంబర్ 2న) విడుదలైన కింగ్ టీజర్ కు భారీ రెస్పాన్స్ లభించింది. ముఖ్యంగా షారుక్ ఖాన్ లుక్ సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. ఈ సినిమాలో భారీగానే తారాగణం నటిస్తున్నట్లు వినిపిస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమాకి సంబంధించి బడ్జెట్ గురించి పలు విషయాలు వైరల్ గా మారుతున్నాయి.


షారుక్ ఖాన్ కింగ్ సినిమా దాదాపుగా రూ. 350 కు చేరుకుందని, ఇందులో షారుఖ్ ఖాన్ సినిమాకి సంబంధించి ప్రమోషన్, ఇతర ఖర్చులతో ఇంత బడ్జెట్ అయినట్లుగా వినిపిస్తున్నాయి. దీంతో కింగ్ సినిమా ఇప్పటివరకు నిర్మించిన అత్యధికంగా ఖరీదైన ఇండియన్ యాక్షన్ సినిమాగా నిలుస్తోంది. అయితే మొదట కింగ్ సినిమా చిన్న యాక్షన్ థ్రిల్లర్గా మొదలయ్యిందట. డైరెక్టర్ సుజోయ్ ఘోష్ షారుక్ ఖాన్ ని అతిధి పాత్రలో  కనిపించేలా ప్లాన్ చేశారు. అయితే అప్పటి బడ్జెట్ ప్రకారం రూ .150 కోట్లు కేటాయించారు.

కానీ కథను మరింత విస్తరింపజేయగా.. అనంతరం సిద్ధార్థ ఆనంద్ ఈ ప్రాజెక్టులోకి భాగం కావడంతో మొత్తం కథను షారుక్ ఖాన్ తో తిరిగి మళ్ళీ డిజైన్ చేశారు. ఇండియన్ చిత్రాలలో ఇప్పటివరకు ఎప్పుడు చూడని యాక్షన్ సీన్స్ ఇందులో ప్లాన్ చేసినట్లు వినిపిస్తున్నాయి . ఈ చిత్రానికి సంబంధించి షారుఖ్ ఖాన్, సిద్ధార్థ ఆనంద్ కు పూర్తిగానే స్వేచ్ఛ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో డైరెక్టర్ సిద్ధార్థ రూ. 350 కోట్ల రూపాయల బడ్జెట్ అవసరమని తెలియజేశారు. షారుక్ ఖాన్ కూడా అతని ఆలోచనకు ఫిదా అయ్యారు. ఈ సినిమాకి ఒప్పుకోవడానికి ముఖ్య కారణం ఇదే అంటూ బాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: