బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ నటులలో ఒకరు అయినటువంటి షారుక్ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకొని హిందీ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఇక ఈయన ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను కూడా సంపాదించుకున్నాడు. ఈయనకు కేవలం మామూలు ప్రేక్షకులు మాత్రమే కాకుండా ఎంతో మంది సెలబ్రిటీల్లో కూడా అభిమానులు ఉన్నారు.

ఇక ఎంతో మంది నటులు నటీమణులు కూడా ఈయనకు అభిమానులు ఉన్నారు. ఇకపోతే ఈయన ఒక వీరాభిమాని టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోయిన్. ఇక ఆమె షారుఖ్ ఖాన్ సినిమాలో అవకాశం రావడంతో ఒక్క రూపాయి కూడా పారితోషకం తీసుకోకుండా ఆయన సినిమాలో నటించిందట. ఇంతకు ఆ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె మరెవరో కాదు ప్రియమణి. అసలు విషయం లోకి వెళితే కొన్ని సంవత్సరాల క్రితం షారుక్ ఖాన్ హీరో గా దీపికా పదుకొనే హీరోయిన్గా చెన్నై ఎక్స్ ప్రెస్ అనే సినిమా వచ్చిన విషయం మనకు తెలిసిందే.

మూవీ లో ప్రియమణి ఐటమ్ సాంగ్ లో నటించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడం , ఈ సాంగ్ కి మంచి క్రేజ్ లభించడం , అలాగే ఇందులో ఈమె తన అందాలతో , డ్యాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీ ద్వారా ప్రియమణి కి హిందీ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ చేసే అవకాశం వచ్చిన సమయంలో తన అభిమాన నటుడి మూవీ లో సినిమా అవకాశం రావడంతో ఒక్క రూపాయి కూడా పారితోషకం తీసుకోకుండా ప్రియమణి ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: