- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నటించిన తాజా చిత్రం “తెలుసు కదా” థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్‌డ్ రివ్యూస్ తెచ్చుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. లేటెస్ట్ అప్‌డేట్ ప్ర‌కారం నవంబర్ 14, 2025 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో తెలుగు భాషలో స్ట్రీమింగ్ కానుంది. ఇతర భాషా వెర్షన్‌లు కొద్ది రోజుల తర్వాత రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాకు నీరజ కోన దర్శకత్వం వహించగా, ప్రముఖ బ్యానర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. సిద్ధు, ఈ సినిమాలో ప్రేమలోని సంక్లిష్టతలను, భావోద్వేగాలను సహజంగా అద్భుతంగా ప్రదర్శించాడు. రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి పాత్రలు కూడా కథకు బలాన్ని చేకూర్చాయి.


దీపావళి పండుగ సందర్భంగా పలు పెద్ద సినిమాలు విడుదల కావడంతో “ తెలుసు కదా ” థియేటర్లలో గ‌ట్టి పోటీ ఎదుర్కొంది. ఆ పోటీ ప్రభావం వల్ల ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయింది. మ్యూజిక్, విజువల్స్ మంచి ప్రశంసలు పొందినా, స్క్రీన్‌ప్లే పాక్షికంగా నెమ్మదిగా ఉండటంతో కొన్ని వ‌ర్గాల ప్రేక్షకులను తెలుసుక‌దా సినిమా నిరాశపరిచింది. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతున్న నేపథ్యంలో, ఈ సినిమా ఓటీటీ వేదికగా కూడా ప్రేక్ష‌కుల‌ను మెప్పించే ఛాన్స్ ఉంద‌ని సినిమా వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నారు.


యూత్‌కు ఈ సినిమా బాగా క‌నెక్ట్ అయ్యింది. థియేటర్స్‌లో మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు డిజిటల్‌గా ఈ సినిమాను ఆస్వాదించనున్నారు. ఫైన‌ల్‌గా “ తెలుసు కదా ” ఓ మ్యూజికల్ రొమాంటిక్ డ్రామాగా, సున్నితమైన ఎమోషన్లను చూపించే చిత్రం. ప్రేమ, విరహం, సంబంధాల మధ్య ఉన్న భావోద్వేగాల్ని ఈ కథ ప్రధానాంశంగా తీసుకుంది. థియేటర్లలో మోస్తరు స్పందన వచ్చినా, ఓటీటీలో ఇది మంచి వ్యూస్ సాధించే అవకాశాలు ఉన్నాయని అంచనా. నవంబర్ 14న నెట్‌ఫ్లిక్స్‌లో సినిమా ఎలా దూసుకుపోతుందో ఇప్పుడు అందరి చూపు దానిపైనే ఉంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: