ఇప్పటికే రష్మిక మందన పాన్ ఇండియా రేంజ్‌లో పేరు తెచ్చుకుంది. పలు సక్సెస్‌ఫుల్ సినిమాల తర్వాత ఆమె క్రేజ్ మరింత పెరిగింది. దాంతో దర్శక–నిర్మాతలు కూడా రష్మికనే ప్రాధాన్యతగా తీసుకుంటున్నారని టాక్. ఇదే సమయంలో జాన్వీ కపూర్ కూడా దక్షిణాది సినిమాలపై దృష్టి సారించి, తెలుగు, తమిళ ప్రాజెక్టుల్లో భాగం కావడానికి సిద్ధమవుతోంది. కానీ ఆమెకు సైన్ అయిన కొన్ని సినిమాలు చివరి క్షణంలో రష్మికకు వెళ్లిపోవడంతో, అభిమానుల్లో అసంతృప్తి మొదలైంది.కొంతమంది ఫ్యాన్స్ మాట్లాడుతూ, “ఇదేం టార్చర్ రా బాబు..! జాన్వీ సరిగ్గా హిట్ ట్రాక్‌లోకి రావాలనుకుంటే, ఆమె ప్రాజెక్టులు అన్నీ రష్మికకు వెళ్తున్నాయి. ఇలాంటిదే మరి పాత కాలంలో కూడా జరిగింది, ఇప్పుడు మళ్లీ ఆ రిపీట్” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇంకా రష్మిక అభిమానులు మాత్రం దీనికి కౌంటర్ ఇస్తున్నారు. “డైరెక్టర్ ఎవరికి నచ్చితే వాళ్లని తీసుకుంటారు. రష్మికకు టాలెంట్ ఉంది, క్రేజ్ ఉంది, అందుకే ఛాన్స్ వచ్చింది. ఇందులో ఎవరి తప్పూ లేదు” అని వాళ్లు రక్షణగా మాట్లాడుతున్నారు.బాలీవుడ్‌లో సాధారణంగా నార్త్ హీరోయిన్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని, సౌత్ నటీమణులకు తర్వాత ప్రిఫరెన్స్ ఇస్తారని ఇప్పటివరకు అనుకునేవారు. కానీ రష్మిక మందన వచ్చాక ఆ సమీకరణం మొత్తం తలకిందులైంది. సౌత్ నుంచే వచ్చిన ఈ బ్యూటీ తన ఆకర్షణ, స్క్రీన్ ప్రెజెన్స్, స్మార్ట్ అటిట్యూడ్‌తో హిందీ ప్రేక్షకులను కూడా మెప్పించింది. దాంతో ఆమెకు బిగ్ ప్రాజెక్టుల వరుస లభిస్తున్నాయి. అదే సమయంలో జాన్వీ కపూర్ కూడా తన కెరీర్‌లో కొత్తదనం చూపించాలనే ఆరాటంలో ఉంది. కానీ ఆమె సైన్ చేసిన లేదా స్క్రిప్ట్ లెవెల్‌లో ఉన్న సినిమాలు ఒక్కొక్కటిగా రష్మిక చేతుల్లోకి వెళ్తుండటంతో ఆమె ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.నెటిజన్లు ఇప్పుడు సోషల్ మీడియాలో ఇద్దరి మధ్య పోలికలు వేస్తూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి