ఇదంతా జరుగుతుండగా అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోవడంతో మెగా ఫ్యామిలీ మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. వరుసగా ఇలా సంతోష వార్తలు వినిపించడం, మెగా ఫ్యామిలీకి ఇది బంగారు కాలం మొదలైనట్లుగా ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.ఇప్పుడు ఈ గుడ్ న్యూస్‌లకు మరో జోడింపు వస్తోందట. అదేంటంటే — సాయిధరమ్ తేజ్ పెళ్లి గురించి వస్తున్న వార్త. గతంలో కూడా సాయిధరమ్ తేజ్ వివాహ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టినా అవి రూమర్లగానే తేలాయి. కానీ ఈసారి మాత్రం పరిస్థితి పూర్తిగా వేరుగా ఉందట. ఈసారి వస్తున్న సమాచారం చాలా స్ట్రాంగ్ సోర్స్ నుంచి వస్తోందని, ఫ్యామిలీ సర్కిల్ నుంచే బయటకు లీక్ అయ్యిందని అంటున్నారు.
వైరల్ అవుతున్న వార్తల ప్రకారం, సాయిధరమ్ తేజ్ ఈసారి లవ్ మ్యారేజ్ కాదు, తన అమ్మా నాన్నలు చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నారట. ఇంతకుముందు ఆయన ఒక ప్రముఖ హీరోయిన్‌తో సన్నిహితంగా ఉన్నారని, వారిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోందని రూమర్లు వచ్చినప్పటికీ, వాటికి ఎప్పుడూ కన్ఫర్మేషన్ రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం కుటుంబ సభ్యుల అభిమతంతో సంబంధం ఫిక్స్ అయ్యిందట.సమాచారం ప్రకారం, వివాహ సంబంధం దాదాపు ఖరారైందని, త్వరలోనే అధికారికంగా శుభముహూర్తం కూడా ఫిక్స్ చేసి, మెగా ఫ్యామిలీ నుంచి అధికారిక ప్రకటన రాబోతోందని అంటున్నారు. అంతే కాదు, ఫిబ్రవరిలో నిశ్చితార్థం, తర్వాత మార్చి లేదా ఏప్రిల్‌లో పెళ్లి జరగవచ్చని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
ఇక ఇదంతా జరిగే టైమింగ్ కూడా అభిమానులకు ఆనందాన్ని ఇస్తోంది. ఎందుకంటే మార్చిలోనే ఉపాసన డెలివరీ డేట్ ఉండగా, ఫిబ్రవరిలో సాయిధరమ్ తేజ్ నిశ్చితార్థం జరగబోతుందట. అంటే ఒకే కాలంలో ట్రిపుల్ ధమాకా సీజన్ మెగా ఫ్యామిలీకి రాబోతుందన్నమాట — లావణ్య బేబీ బర్త్, ఉపాసన ట్విన్స్ అనౌన్స్‌మెంట్, సాయిధరమ్ తేజ్ ఎంగేజ్మెంట్ అండ్ మ్యారేజ్ న్యూస్.ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ వార్తలు వైరల్ అవుతూ, “మెగా ఫ్యామిలీ అంటే నిజంగా ఆనందాల హరివిల్లు” అంటున్నారు జనాలు..!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి