కెరియర్ను ప్రారంభించిన మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకున్న నటులలో రాజ్ తరుణ్ ఒకరు. ఈయన ఉయ్యాల జంపాల అనే మూవీ తో హీరో గా కెరియర్ను మొదలు పెట్టాడు. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. అలాగే ఈ సినిమాలో రాజ్ తరుణ్ కూడా తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. దానితో ఈ సినిమా ద్వారా ఈయనకు మంచి గుర్తింపు వచ్చింది. ఇకపోతే ఈయన నటించిన సినిమాలలో కుమారి 21 ఎఫ్ సినిమా మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఈ మూవీ ద్వారా ఈయన క్రేజ్ మరింతగా పెరిగిపోయింది.

కుమారి 21 ఎఫ్ సినిమా తర్వాత ఈయన ఎన్నో సినిమాల్లో నటించాడు. కానీ ఆ స్థాయి విజయం మాత్రం ఇప్పటివరకు రాజ్ తరుణ్ కి దక్కలేదు. గత కొంత కాలంగా ఈయన నటించిన చాలా సినిమాలు బాక్సా ఫీస్ దగ్గర ప్లాప్ అయ్యాయి. దానితో ఈయన క్రేజ్ కూడా చాలా వరకు పడిపోయింది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరో గా రూపొందిన నా సామి రంగ అనే సినిమాలో ఈయన ఓ ముఖ్యమైన పాత్రలో నటించాడు.

మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా రాజ్ తరుణ్ చిరంజీవి అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ నేరుగా ఆహా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది. ఈ మూవీ కి ప్రస్తుతం ఆహా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ కి సూపర్ సాలిడ్ వ్యూస్ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో దక్కినట్లు తెలుస్తోంది. ఇలా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో నేరుగా విడుదల అయిన చిరంజీవ మూవీ కి ప్రస్తుతం మంచి రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: