తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో తిరు వీర్ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో , విలన్ పాత్రల్లో నటించాడు. కొంత కాలం క్రితం ఈయన మసుద అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈయనకు హీరోగా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈయన నటించిన పరేషాన్ సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఈ మూవీ తో ఈ నటుడి క్రేజ్ మరింతగా పెరిగింది. తాజాగా ఈ నటుడు ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అనే సినిమాలో హీరో గా నటించాడు.

తాజాగా విడుదల అయిన ఈ సినిమాకు అద్భుతమైన హిట్ టాక్ వచ్చింది. దానితో ప్రస్తుతం ఈ సినిమా సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసూలు చేస్తూ ముందుకు దూసుకుపోతుంది. ఈ నటుడు తన తదుపరి మూవీ ని తాజాగా ఫిక్స్ చేసుకున్నాడు. తిరు వీర్ తన తదుపరి మూవీ ని భరత్ దర్శన్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ మూవీ లో హీరోయిన్గా ఐశ్వర్య రాజేష్ పిక్స్ అయింది. ఐశ్వర్య రాజేష్ ఆఖరుగా విక్టరీ వెంకటేష్ హీరో గా రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకొని ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్లను బాక్సా ఫీస్ దగ్గర కొల్లగొట్టింది.

మూవీ తో ఈమెకు అద్భుతమైన క్రేజ్ వచ్చింది. ఇంత అద్భుతమైన క్రేజ్ కలిగిన నటి తిరు వీర్ లాంటి చిన్న హీరో సినిమాలో హీరోయిన్గా నటిస్తూ ఉండడంతో ఈ మూవీ లో అద్భుతమైన కంటెంట్ ఉండి ఉంటుంది. అందుకే ఈమె ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది అని చాలా మంది భావిస్తున్నారు. ఒక వేళ తీరు వీర్ , ఐశ్వర్య రాజేష్ కాంబో లో రూపొందబోయే సినిమా కూడా మంచి విజయం సాధిస్తే వీరిద్దరి క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: