టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీ లో శివరాజ్ కుమార్ , జగపతి బాబు , దివ్యాందు కీలకమైన పాత్రల్లో కనిపించనుండగా ... ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. వృద్ధి సినిమాస్ , మైత్రి సంస్థ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం మార్చి 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు చాలా కాలం క్రితమే ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు.

ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లను పక్క ప్లానింగ్ తో నిర్వహిస్తూ వస్తున్నారు. కొంత కాలం క్రితం ఈ మూవీ నుండి ఫస్ట్ షాట్ అనే పేరుతో మేకర్స్ ఒక వీడియోను విడుదల చేశారు. దానికి అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించింది. తాజాగా ఈ మూవీ యూనిట్ వారు ఈ సినిమా నుండి చిక్రి చిక్రి అంటూ సాగే మొదటి పాటను విడుదల చేశారు. ఈ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుంది. ఈ మూవీ లోని రెండవ సాంగ్ విడుదల కోసం ఈ మూవీ బృందం వారు ప్లాన్ వేసినట్లు తెలుస్తుంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ బృందం వారు కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన ఫస్ట్ షార్ట్ వీడియోలో వాడిన మస్సా మస్సా సాంగ్ ను సెకండ్ సింగల్ గా విడుదల చేయనున్నట్లు , అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మరికొన్ని రోజుల్లో ఈ మూవీ బృందం వారు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ సినిమాపై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే ఇంకా చాలా కాలం వెయిట్ చేయవలసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: