ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఈ మధ్య కాలంలో వరుస అపజయాలతో చాలా వెనుకబడిపోయాడు. ఆయన నటించిన ది వారియర్ , స్కంద , డబల్ ఇస్మార్ట్ సినిమాలు వరసగా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఇలా వరుస అపజయాలతో డీలా పడిపోయిన రామ్ ప్రస్తుతం మహేష్ బాబు పి దర్శకత్వంలో రూపాందుతున్న ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. భాగ్య శ్రీ బోర్స్ ఈ మూవీ లో హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... ఉపేంద్రమూవీ లో ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాను ఈ నెల 28 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకి సంబంధించిన ప్రచార చిత్రాలను వరుస పెట్టి విడుదల చేస్తున్నారు. అలాగే ఈ మూవీ కి సంబంధించిన పాటలను కూడా విడుదల చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి మేకర్స్ మూడు సాంగ్స్ ను విడుదల చేశారు. ఈ మూవీ బృందం వారు విడుదల చేసిన మూడు సాంగ్స్ కి కూడా మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాలోని నాలుగవ సాంగ్  విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేశారు.

తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాలోని నాలుగవ సాంగ్ అయినటువంటి ఫస్ట్ డే ఫస్ట్ షో అంటూ సాగే సాంగ్ను నవంబర్ 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను విడుదల చేశారు. ఇప్పటివరకు ఈ మూవీ నుండి మేకర్స్ విడుదల చేసిన మూడు సాంగ్స్ కూడా బాగుండడంతో నాలుగవ సాంగ్ అయినటువంటి ఫస్ట్ డే ఫస్ట్ షో కూడా బాగుంటుంది అని ప్రేక్షకులు అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీలోని నాలుగవ సాంగ్ అయినటువంటి ఫస్ట్ డే ఫస్ట్ షో అంటూ సాగే సాంగ్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే నవంబర్ 12 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: