టాలీవుడ్ హీరోయిన్ తమన్నా ,బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ గతంలో ప్రేమలో ఉన్నారనే విధంగా వార్తలు వినిపించాయి. ముఖ్యంగా ఇద్దరూ కలిసి ఒకే కారులో ప్రయాణించడం ఒకే చోట కనిపించడంతో ఈ రూమర్స్ కు మరింత బలాన్ని చేకూర్చాయి. వీరిద్దరూ కలిసి లస్ట్ స్టోరీప్ 2 అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్న సమయంలో ప్రేమలో పడ్డారు. అయితే కొన్ని నెలల పాటు సీక్రెట్ గా ప్రేమాయణం నడిపిన ఈ జంటను చూసి వివాహం చేసుకుంటారని అభిమానులు భావించారు. ఆ తర్వాత కొన్ని నెలలకే బ్రేకప్ వార్తలు బ్రేకప్ అంటూ వార్తలు వినిపించడంతో షాక్ గురయ్యారు.


అప్పటినుంచి వీరిద్దరూ ఎక్కడ కూడా కలిసి కనిపించకపోవడంతో ఈ రూమర్స్ నిజమేనని నమ్మారు అభిమానులు. అయితే ఇటీవలే వర్మ మరొక నటితో ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. తాజాగా  విజయ్ వర్మ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను డిప్రెషన్ కి గురయ్యానని తెలిపారు.. కెరియర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న సమయంలో నాకు సడన్గా బ్రేక్ పడింది. ఆ ఫీలింగ్స్ నన్ను చాలా ఇబ్బందులకు గురి చేశాయి. ఆ సమయంలో తాను ఎక్కువగా ఇంట్లోనే ఉండిపోయి డిప్రెషన్ కి గురయ్యాను. చివరికి పిచ్చోడిలా బాధపడుతున్న సమయంలోనే అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ , గుల్షన్ దేవయ్య తనకు అండగా నిలిచారని తెలిపారు.



తనకు ఎన్నోసార్లు వీడియో కాల్స్ చేసి డిప్రెషన్ నుంచి బయటకు తీసుకు రావడానికి ప్రయత్నాలు చేసిందని, ఎప్పుడూ ఒకే చోట ఉండకుండా  కెరియర్లో ముందుకు వెళ్లే మార్గం చూసుకోవాలని ఐరా ఖాన్ తనని చాలా ప్రోత్సహించింది అంటూ తెలిపారు విజయ్ వర్మ. తనకు ఆమె మద్దతు లేకపోతే తాను ఈ పాటికి ఎప్పుడో పిచ్చోడిలా మారిపోయేవాడినని తెలిపారు. ప్రస్తుతం విజయ్ వర్మ, ఫాతిమా సనా కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రం షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించినట్లు బాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి.ఈ విషయం పైన ఏ ఒక్కరూ క్లారిటీ ఇవ్వలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: