గత కొద్ది రోజుల నుండి బాలీవుడ్ నటుడు గోవిందా తన భార్య సునీత అహుజాతో విడిపోతున్నట్టు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా సునీత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు బీ టౌన్ లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఆ ఇంటర్వ్యూలో సునీత ఒక సూపర్ స్టార్ ని పెళ్లి చేసుకోవడం వల్ల కలిగిన నష్టాల గురించి చెప్పుకొచ్చింది. ఆ ఇంటర్వ్యూలో సునీత అహుజా మాట్లాడుతూ.. చిన్నతనంలో చాలామంది తప్పులు చేస్తారు.. అలాంటి తప్పులు నేను కూడా చేశాను. కానీ పెద్దయ్యాక భార్య పిల్లలు ఉన్నా కూడా ఇలాంటి తప్పులు ఎందుకు చేయాలి. వాస్తవంగా చెప్పాలంటే గోవిందా నాతో కంటే ఎక్కువగా హీరోయిన్లతోనే గడిపారు. మొదట్లో నాకు అంతగా ఏమీ తెలిసేది కాదు.కానీ తెలుసుకునే సరికే అంతా ముందుకు వెళ్ళిపోయింది. 

ఒక సూపర్ స్టార్ భార్య కావాలి అంటే కచ్చితంగా ఆ స్త్రీ కఠిన హృదయాన్ని రాయిలాంటి హృదయాన్ని కలిగి ఉండాలి. బలంగా ఉండాలి. కానీ దాన్ని నేను తెలుసుకోవడానికి 38 సంవత్సరాల సమయం పట్టింది. గోవింద ఒక మంచి కొడుకు మరియు మంచి సోదరుడు అయినప్పటికీ అతను ఒక మంచి భర్త కాదు.ఒకవేళ మళ్లీ జన్మంటూ ఉంటే ఆయన్ని భర్తగా అస్సలు కోరుకోను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది సునీత.ఇక సునీత మాటల్ని బట్టి చూస్తే మళ్లీ వీరిద్దరి మధ్య గొడవలు వచ్చాయని,అందుకే గోవింద గురించి ఈ వ్యాఖ్యలు చేసినట్టు అర్థమవుతుంది.

ఇక గోవిందా సునీత ఇద్దరు 1987లో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు.ఇక వీరి పెళ్లయిన రెండు ఏళ్లకు కుమార్తె టీనా పుట్టాక కూడా వారి వివాహాన్ని రహస్యంగా ఉంచారు. అలా సునీత తాజా ఇంటర్వ్యూలో చేసిన కామెంట్లు విడాకులకు ఆజ్యం పోసేలా ఉన్నాయి. దీంతో ఈ జంట నిజంగానే విడిపోతున్నారని మరోసారి రూమర్లు బాలీవుడ్లో వైరల్ అవుతున్నాయి ఇక ఇదే ఇంటర్వ్యూలో సునీత తన భర్తకి ఓ మరాఠీ నటితో ఎఫైర్ ఉందని ప్రచారం జరుగుతుంది కానీ నేను దాన్ని కన్ఫామ్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే నేను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోలేదు కదా అంటూ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: