ఇండియన్ సినిమా అభిమానులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న క్షణం ఎట్టకేలకు వచ్చేసింది. దక్షిణ భారత సినీ పరిశ్రమను దశాబ్దాలుగా ఏలుతూ, తనదైన ముద్ర వేసిన ఇద్దరు లెజెండరీ నటులు — సూపర్ స్టార్ రజనీకాంత్ మరియు లోకనాయకుడు కమల్ హాసన్ — మళ్లీ ఒకే ప్రాజెక్ట్ కోసం చేతులు కలిపారు. వీరిద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించబోతున్నారన్న వార్త వినగానే అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంది. అయితే ఫ్యాన్స్ ఊహించినట్లు ఇది కేవలం స్క్రీన్ షేర్ చేసే సినిమా మాత్రమే కాదు — దానికి మించిన సర్‌ప్రైజ్ ఈ ప్రాజెక్ట్‌లో దాగి ఉందని చెప్పవచ్చు.


ఈ  ప్రాజెక్ట్‌లో రజనీకాంత్ హీరోగా నటిస్తుండగా, కమల్ హాసన్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్   బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి “తలైవర్ 173” అనే వర్కింగ్ టైటిల్‌ను పెట్టారు. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు సుందర్ సి. దర్శకత్వం వహించనుండటం మరో హైలైట్‌గా మారింది. ప్రత్యేక వీడియో ద్వారా అధికారికంగా ప్రకటించిన ఈ హిస్టారిక్ అనౌన్స్‌మెంట్ సోషల్ మీడియాలో రికార్డులు బద్దలుకొడుతోంది. ఆ వీడియోలో కమల్ హాసన్, రజనీకాంత్, సుందర్ సి. ముగ్గురూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం అభిమానుల్లో సంబరాలను రెట్టింపు చేసింది.



సుందర్ సి. దర్శకత్వం వహిస్తున్నాడన్న అంశం ఈ ప్రాజెక్ట్‌కి మరో విశేషం. రజనీకాంత్ – సుందర్ సి. కాంబినేషన్ అంటే అభిమానులకు వెంటనే గుర్తొచ్చేది 1990లలో సంచలన విజయాన్ని సాధించిన “అరుణాచలం”. దాదాపు 28 సంవత్సరాల తర్వాత ఈ ఇద్దరూ మళ్లీ కలిసి పనిచేస్తుండటంతో ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రజనీకాంత్ ప్రత్యేకమైన కామెడీ టైమింగ్‌, మాస్ స్టైల్‌, స్క్రీన్ ప్రెజెన్స్‌ను సుందర్ సి. ఏ స్థాయిలో చూపిస్తాడో అన్న ఉత్కంఠ పెరిగింది. సుందర్ సి. గత కొన్నేళ్లలో హారర్ కామెడీ జానర్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. “చంద్రకళ”, “కళావతి” వంటి సినిమాలతో భారీ విజయాలు సాధించి, ప్రేక్షకులను మెప్పించాడు.

 

ఇక రజనీకాంత్ విషయానికి వస్తే, “చంద్రముఖి” తర్వాత ఆయన మళ్లీ ఆ జానర్‌ను టచ్ చేయలేదు. అందువల్ల “తలైవర్ 173” కూడా హారర్ ఎలిమెంట్స్‌తో నిండిన సినిమా కానుందా అనే ఆతృత అభిమానుల్లో పెరుగుతోంది. ఈ ఇద్దరు లెజెండ్స్ కలిసి పనిచేయడం మాత్రమే కాకుండా, ఒక లెజెండ్ (కమల్ హాసన్) మరో లెజెండ్ (రజనీకాంత్) కోసం నిర్మాతగా వ్యవహరించడం భారతీయ సినిమా చరిత్రలో ఇదే మొదటిసారి అనే చెప్పాలి. ఇది నిజంగానే రెండు తరాల అభిమానులకూ, భారతీయ సినీ ప్రేమికులకూ ఒక సినీ పండుగగా మారనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: