టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ మహారాజ్ రవితేజకు ఊహించని స్థాయిలో ఫ్యాన్ బేస్ ఉంది. రవితేజ సినిమాలకు హిట్ టాక్ ఏ స్థాయిలో కలెక్షన్లు వస్తాయో ఇప్పటికే చాలా సినిమాలు ప్రూవ్ చేశాయి. మాస్ జాతర సినిమాకు ప్లాప్ టాక్ వచ్చినా ఈ సినిమా కలెక్షన్ల విషయంలో అదరగొడుతోంది. సెకండ్ వీకెండ్ లో సైతం ఈ సినిమాకు డీసెంట్ కలెక్షన్లు వచ్చాయి. అయితే రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి గ్లింప్స్ తాజాగా విడుదలైంది.
ప్రముఖ దర్శకుడు కిషోర్ తిరుమల డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కగా 2026 సంక్రాంతి పండుగ కానుకగా ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమాలో రామ సత్యనారాయణ అనే పాత్రలో రవితేజ కనిపించనున్నారు. ఆషిక రంగనాథ్, డింపుల్ హయాతి ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. ఈ టీజర్ కొత్తగా ఉండటంతో పాటు క్లాస్ ప్రేక్షకులను టార్గెట్ చేసి ఈ సినిమాను తెరకెక్కించారని
అర్థమవుతోంది.
ఈ టీజర్ లో రవితేజ చాలా కూల్ గా కనిపించారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సుధాకర్ చెరుకూరి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా తరహాలో ఈ సినిమా ఉండబోతుందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతుతున్నాయి. ఈ సినిమా కాన్సెప్ట్ కూడా కొత్తగా ఉండబోతుందని గ్లింప్స్ చుస్తే అర్థమవుతోంది.
బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్ల విషయంలో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది. వరుస విజయాలతో రవితేజ పూర్వ వైభవాన్నీ సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రవితేజ పారితోషికం 15 కోట్ల రూపాయలుగా ఉండగా రవితేజ పారితోషికంతో పాటు లాభాల్లో వాటా తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి