ఇటువంటి తరుణంలోనే మీనాక్షి చౌదరి భవిష్యత్తులో సినిమాలు చేయడం పైన పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. తాను ఎలాంటి సినిమాలలోనైన కథ నచ్చితే నటిస్తానని, సీనియర్ హీరోలైన పర్వాలేదు వారి సరసన నటించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. కానీ పిల్లలకు తల్లిగా కనిపించే పాత్ర వస్తే మాత్రం ఎటువంటి సినిమా అయినా తాను రిజెక్ట్ చేస్తానని తెలియజేసింది. కానీ లక్కీ భాస్కర్ సినిమాలో మాత్రం కొన్ని అనువార్య కారణాలవల్ల తాను తల్లి పాత్రలో నటించాల్సి వచ్చింది అంటూ క్లారిటీ ఇచ్చింది మీనాక్షి చౌదరి.
ఇకమీదట తల్లి పాత్రలు పోషించనని తెలియజేసింది. కానీ 70 ఏళ్ల వయసు ఉన్న హీరోలతో కూడా హీరోయిన్గా అవకాశం వస్తే మాత్రం వదులుకోనంటూ హింట్ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. మొత్తానికి ఇక మీదట తాను హీరోయిన్గా నటించాలని భావిస్తోంది తప్ప తల్లి పాత్రలకు దూరంగా ఉంటానని చెప్పేస్తోంది. మీనాక్షి చౌదరి ప్రస్తుతం తెలుగు, తమిళ భాషలలో నటిస్తూ బిజీగా ఉంది. అవకాశాలు వస్తే ఇతర భాషలలో అయినా నటించడానికి సిద్ధంగానే ఉన్నది ఈ ముద్దుగుమ్మ. నిరంతం సోషల్ మీడియాలో యాక్టివ్ గానే కనిపిస్తుంది మీనాక్షి చౌదరి.మీనాక్షి చౌదరి హర్యాన ప్రాంతానికి చెందిన అమ్మాయి. వృత్తిరీత్యా డాక్టర్ కోర్స్ పూర్తి చేసింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి