గోపీచంద్ మలినేని ఈ సీక్వెన్స్‌ను సినిమా హైలైట్‌గా డిజైన్ చేశాడట. బాలయ్య స్టైల్, డైలాగ్ డెలివరీ, మరియు పీరియాడిక్ గెటప్ కలయికగా వచ్చే ఈ సన్నివేశం ఫ్యాన్స్‌కు ఫీస్ట్‌గా మారబోతోందని టాక్. ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నట్లు సమాచారం. బాలయ్య – నయనతార కాంబినేషన్ చాలా ఏళ్ల తర్వాత మళ్లీ రిపీట్ అవుతుండటంతో అభిమానుల్లో ఎగ్జైట్‌మెంట్ మరింత పెరిగింది. ఇక కథ విషయానికి వస్తే, ఈ సినిమా కొంత హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందని, ఆధునిక యుగం మరియు పాత యుగం మధ్య ఒక కనెక్ట్ చూపించే విధంగా కథ వర్కౌట్ అవుతోందని తెలుస్తోంది. ప్రస్తుతం దర్శకుడు గోపీచంద్ మలినేని బృందంతో కలిసి రాజస్థాన్‌లోని పలు కోటలు, పాత రాజమహల్‌లలో షూటింగ్ లొకేషన్ల కోసం రిక్కీ చేస్తున్నాడు.
ఇక ఇప్పటికే సెట్స్ డిజైన్, కాస్ట్యూమ్స్, యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం టాప్ టెక్నీషియన్లు ఫైనల్ అయ్యారని సమాచారం. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ బాలయ్య కెరీర్‌లో మరో లెజెండరీ చాప్టర్‌గా నిలవనుందని ఫ్యాన్స్ నమ్మకం. ఇటీవల గోపీచంద్ మలినేని ఎక్స్‌లో (ట్విట్టర్‌లో) ‘‘గాడ్ ఆఫ్ మాసెస్ ఈజ్ బ్యాక్.. ఈసారి మా గర్జన మరింత గట్టిగా వినిపిస్తుంది. ఇది చరిత్రలో నిలిచిపోయే సినిమా అవుతుంది’’ అని రాసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొత్తానికి బాలయ్య బాబు తన పాత లుక్‌లో కనిపించే ఈ స్పెషల్ సీన్, సినిమా మొత్తానికి మేజర్ అట్రాక్షన్‌గా మారబోతుందనడంలో సందేహమే లేదు. హిస్టారికల్ థ్రిల్, మాస్ ఎలిమెంట్స్, బాలయ్య పవర్ – ఈ మిక్స్‌తో 111వ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి