బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ ధర్మేంద్ర గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గత కొన్నిరోజులుగా బాలీవుడ్ సీనియర్ హీరో ధర్మేంద్ర ఆరోగ్యం విషమంగా ఉందని సోషల్ మీడియా వేదికగా జోరుగా ప్రచారం జరిగింది. ముంబైలో బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో ఆయన చేరగా చికిత్సకు కోలుకోలేక ఆయన మృతి చెందారు. ఆయన మరణ వార్త తెలిసి అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.
గత నెల 31వ తేదీన ఆయన సాధారణ చెకప్ కోసం బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో చేరారు. ధర్మేంద్ర చివరిసారిగా గతేడాది విడుదలైన తేరి బాటమ్ మే ఐసా ఉల్జా జియా సినిమాలో నటించారు. ఆయన నటించిన అగస్త్యా నందా నిక్కీస్ మూవీ ఈ ఏడాది క్రిస్మస్ పండుగ కానుకగా విడుదల కానుంది. శ్వాస సంబంధిత సమస్యల వల్లే ధర్మేంద్ర కన్ను మూశారని తెలుస్తోంది.
ఐకానిక్ మూవీ షోలే ధర్మేంద్రకు మంచి పేరును తెచ్చిపెట్టిందనే సంగతి తెలిసిందే. ఎన్నో క్లాసిక్ సినిమాలలో ధర్మేంద్ర నటించి భారీ విజయాలను సొంతం చేసుకున్నారు. మాస్ అప్పీల్, స్టైలిష్ యాక్షన్, డైలాగ్ డెలివరీతో ఆయన తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు 89 సంవత్సరాల వయస్సులో ధర్మేంద్ర మృతి చెందారు. ఆయన మరణంతో కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరి వల్ల కావడం లేదు. ఆయన సంతానం బాబీ డియోల్, సన్నీ డియోల్ సినిమా రంగంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి