మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ తాజాగా కాంతా అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటీ మణులలో ఒకరు అయినటువంటి భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్గా నటించగా ... దగ్గుపాటి రానా , సముద్ర ఖని ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించారు. ఈ మూవీ ని నవంబర్ 14 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటివరకు ఈ మూవీ కి సంబంధించిన అనేక ప్రచార చిత్రాలను ఈ మూవీ బృందం వారు విడుదల చేశారు.

మూవీ బృందం వారు ఇప్పటివరకు ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దానితో ఈ మూవీ పై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడం తో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ యూనిట్ ఈ మూవీ యొక్క రన్ టైమ్ ను కూడా లాక్ చేసినట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యూ / ఏ సర్టిఫికెట్ లభించినట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాను 2 గంటల 43 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు సమాచారం. ఇప్పటివరకు ఈ మూవీ నుండి మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దానితో ఈ మూవీ పై జనాల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుని మంచి టాక్ ను తెచ్చుకొని బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంటుందో లేదో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: