తమిళ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నటులలో శివ కార్తికేయన్ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకున్నాడు. శివ కార్తికేయన్ కొంత కాలం క్రితమే ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన మదరాసి అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమణి రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకోలేకపోయింది. ప్రస్తుతం శివ కార్తికేయన్ "పరాశక్తి" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు.

మూవీ లో శ్రీ లీల హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ ని మరి కొంత కాలం లోనే విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత శివ కార్తికేయన్ , సిబి చక్రవర్తి దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో కూడా శ్రీ లీల హీరోయిన్గా నటించే అవకాశం ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. శివ కార్తికేయన్ మరో మూవీ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. శివ కార్తికేయన్ , వెంకట్ ప్రభు దర్శకత్వం లో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

శివ కార్తికేయన్ హీరో గా వెంకట్ ప్రభు సైన్స్ పిక్షన్ మూవీ ని రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ను 2026 పొంగల్ తర్వాత ప్రారంభించే ఆలోచనలో ఈ మూవీ బృందం వారు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వెంకట్ ప్రభు, శివ కార్తికేయన్ తో చేయబోయే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో అత్యంత బిజీ గా ఉన్నట్లు తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను వెంకట్ ప్రభు కంప్లీట్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

sk