ఈ రోజు స్టేజ్ మీద కనిపించబోయే కీలక హైలైట్స్:
*భారత సినిమా చరిత్రలోనే తొలిసారి 130 అడుగుల భీకరమైన ళేడ్ స్క్రీన్
*మహేష్ బాబు కోసం డిజైన్ చేసిన స్పెషల్ ‘మాసివ్ ఎంట్రీ’ సీక్వెన్స్
*మూడు విభిన్న కాన్సెప్ట్స్‌తో రూపొందించిన ట్రిపుల్ గ్రాండియర్ గ్లింప్స్ వీడియో
*జక్కన్న స్టైల్‌లో ప్లాన్ చేసిన హై-వోల్టేజ్ ప్రెజెంటేషన్
అయితే ఈ ఈవెంట్‌ను ఎందుకు ఇప్పుడే… అదే నవంబర్ 15నే ప్లాన్ చేశారని అనేక మంది అనుమానం వ్యక్తం చేస్తుంటే, దానికి వెనుక ఉన్న కారణం ఎంతో భావోద్వేగంతో నిండి ఉంది.నవంబర్ 15 అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు తండ్రి, దివంగత నటసార్వభౌమ కృష్ణ గారి వర్ధంతి. తెలుగు సినీ పరిశ్రమకు అపార సేవలందించిన కృష్ణ గారిని మహేష్ బాబు ఎప్పటికీ మరిచిపోలేడు. ప్రతీ ఏడాది ఈ రోజు ఆయనను ప్రత్యేకంగా స్మరించుకుంటాడు. ఆ ప్రేమను, ఆ గౌరవాన్ని ప్రతిబింబించేలా, ఈసారి తన కెరీర్‌లోనే అతిపెద్ద ఈవెంట్‌ను కూడా ఇదే రోజున నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ భావోద్వేగానికి రాజమౌళి కూడా పూర్తిగా సపోర్ట్ ఇచ్చి, ఈ రోజు మహేష్ బాబుకు జీవితాంతం గుర్తుండిపోయేలా ఒక మహత్తరమైన ఈవెంట్‌ను రూపకల్పన చేశారు. ‘గ్లోబ్ ట్రాటర్’ ద్వారా తెలుగు సినిమా ప్రపంచానికి కొత్త స్టాండర్డ్స్‌ను చూపించబోతుందన్న నమ్మకం ఇప్పుడు ఫ్యాన్స్‌లో మాత్రమే కాదు, మొత్తం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి