ఫైనల్లీ..అందరు అనుకున్నదే జరిగింది… అభిమానుల ఆశలు చివరకు ఫలించాయి.  ఎంతో కాలంగా ఎదురుచూసిన #SSMB29 అధికారిక టైటిల్ ఇప్పుడు ఫిక్స్ అయిపోయింది. కొద్ది సేపటి క్రితమే ఈ టైటిల్ రివీల్ చేశారు మేకర్స్.  సోషల్ మీడియాలో గత కొన్ని వారాలుగా తీవ్రంగా వైరల్ అవుతున్న “వారణాసి” అనే పేరు నే దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి చివరకు కన్ఫర్మ్ చేశారు. నేడు హైదరాబాద్‌లో జరుగుతున్న ‘గ్లోబ్ ట్రాటర్’ గ్రాండ్ ఈవెంట్‌లో ఈ టైటిల్‌తో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు లుక్‌ను భవ్యంగా విడుదల చేశారు. కొన్ని సెకన్లలోనే ఈ టైటిల్ బాగా షేక్ చేసింది. విడుదల చేసిన పోస్టర్‌లో మహేష్ బాబు కనిపించిన తీరు అభిమానులను షాక్‌కు గురి చేస్తోంది. రక్తసిక్తమైన శరీరం… నందిపై నిలబడి, ఒక చేతిలో త్రిశూలం పట్టుకొని ముందుకు దూసుకొస్తున్న మహేష్ – నిజంగా సాక్షాత్తు శివుడే భూమికి అవతరించినట్లు అనిపించేలా ఉంది.
 

ఎగురుతున్న జుట్టు, ఉగ్రరూపం, కళ్లలో రగిలే ధాటీ – ఇలాంటి భీకర లుక్‌లో మహేష్ బాబును ఇప్పటి వరకు ఎప్పుడూ చూడలేదు. ఈ పోస్టర్ ఒక్కటితోనే సినిమాపై అంచనాలు కొత్త లెవెల్‌కి చేరిపోయాయి. ఇవ్వన్నీ చూస్తుంటే, కథ మొత్తం వారణాసి నేపథ్యంలో సాగుతుందని, అందుకే ఆ పేరును రాజమౌళి యాప్‌గా భావించి ఫైనల్ చేశారన్న సమాచారం ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. జక్కన్న మార్క్ విజువల్స్‌, మహేష్ బాబు పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌ – ఈ కాంబినేషన్‌తో సినిమా ఎలా ఉండబోతోందో అనేది అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది.


ప్రస్తుతం విడుదలైన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో దుమ్ములేపుతోంది. “మహేష్ విశ్వరూపం ఇదే!”, “ఇది నెక్స్ట్ లెవల్ ట్రాన్స్‌ఫర్మేషన్”, “రాజమౌళి – మహేష్ కాంబినేషన్ రికార్డులు తిరగరాస్తుంది” అంటూ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.ఇప్పటికే గ్లోబల్‌గా భారీ అంచనాలు ఏర్పడిన ఈ ప్రాజెక్టుకు టైటిల్ & లుక్ రిలీజ్‌తో మరింత హైప్ చేరింది. ఇక సినిమా నుంచి వచ్చే తదుపరి అప్‌డేట్స్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: