కూకట్పల్లి అపార్ట్మెంట్లో ఉంటున్న రవి ఫ్లాట్లో కొన్ని హార్డ్ డిస్కులు, కంప్యూటర్లు కొన్ని సినిమాలకు సంబంధించి హెచ్డి ప్రింట్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే అప్లోడ్ చేయడానికి సిద్ధంగా ఉన్న కొన్ని సినిమా కంటెంట్ కూడా హోల్డ్ చేశారు. కొన్నేళ్ల నుంచి కొన్ని వందల కోట్ల రూపాయలు ఇమ్మడి రవి సంపాదించినట్లుగా పోలీసులు గుర్తించారు. సినీ పరిశ్రమకు గత కొన్నేళ్లుగా రూ .22 వేల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని పోలీసుల దర్యాప్తులో తెలియజేశారు. విచారణ అనంతరం ఆ సైట్ ని కూడా క్లోజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు అధికారులు.
రెండు రోజులపాటు విచారణ అనంతరం పూర్తి వివరాలను మీడియా ముందుకు తెలియజేస్తామని అధికారులు తెలియజేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఐబొమ్మపై కేసులు నమోదయాయని , అసలు ఈ పైరసీ పని ఇతడు ఒక్కడే చేస్తున్నాడా? లేకపోతే అతడి వెనుక ఏదైనా మాఫియా ఉందా? అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గతంలో తెలుగు సినిమాలను పైరసీ చేయడంపై ఐబొమ్మపై తెలుగు ఫిలిం యాంటీ ఫైరసి టీం పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. ఆ సమయంలోనే ఈ వెబ్సైట్ పోలీసులకు సవాలు విసరడంతో దీనిని ఛాలెంజ్గా తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు వారి పైన ప్రత్యేకించి దృష్టి పెట్టి బీహార్ యూపీ వంటి ప్రాంతాలలో నిందితులను అరెస్టు చేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి