ఇదంతా చూసిన వెంటనే ఒకే ఒక్క మాట —“మహేశ్ బాబు నిజంగానే శివుడి అవతారంలా మారిపోయాడు!”..ఎగిరిపడే జుట్టు, అగ్నిలా మండే కళ్లలోని ఉగ్రత, శరీరం నిండా యుద్ధపు మచ్చలు, గాయాలు, ఆగ్రహం, దూకుడు, భీకర శక్తి — ఇంత వరకు ఏ సినిమాలోనూ చూడని మహేష్‌ను జక్కన్న ఈసారి పూర్తిగా కొత్తగా మలిచాడని స్పష్టంగా కనిపిస్తోంది. ఒక్క పోస్టర్‌తోనే సినిమా మీద అంచనాలు ఊహించలేనంత ఎత్తుకు వెళ్లిపోయాయి. ఫిల్మ్ సర్కిల్స్ నుండి వచ్చిన సమాచారం ప్రకారం, ఈ సినిమా మొత్తం వారణాసి నేపథ్యంతో సాగుతుందన్న టాక్ బలంగా వినిపిస్తోంది. ఘాటు యాక్షన్, పురాణాల ప్రభావం, పాత చరిత్ర, ఆధ్యాత్మిక వాతావరణం, దైవ తత్తవం — ఇవన్నీ కలిపి ఒక భారీ కాన్వాస్‌పై ఆవిష్కరించబోతున్నాడట రాజమౌళి. అందుకే ‘వారణాసి’ అనే టైటిల్‌ను ఎంతో ఆలోచించి ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
మహేశ్ బాబును ఇంత భీకరంగా, ఇంత పవర్‌ఫుల్‌గా, ఇంత డార్క్-ఇంటెన్స్‌గా ఎవరూ ఎప్పుడూ చూపలేదు. జక్కన్న చూపించిన ఈ అవతారంతో సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతోందో ఇప్పుడే అర్థమవుతోంది. ఇక పోస్టర్ రిలీజ్ ఒక్కటే ఇలా ఉంటే…
టీజర్, ట్రైలర్, మూవీ—ఏ లెవల్ హావాక్ క్రియేట్ చేస్తాయో ఊహించుకోవడమే కష్టం!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి