తాజాగా విడుదల చేసిన గ్లింప్స్ లో మహేష్ బాబు రోల్ రుద్రగా రివీల్ చేశారు . ముఖ్యంగా మహేష్ బాబు చేతిలో త్రిశూలం పట్టుకొని కనిపించడం హైలైట్ గా నిలిచింది. తాజాగా సోషల్ మీడియాలో వారణాసి సినిమా కథ గురించి కొన్ని ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. మహేష్ ,రాజమౌళి సినిమా స్టోరీ ఇదే అంటూ కొన్ని పోస్టులు కూడా వైరల్ గా మారుతున్నాయి.. అదేమిటంటే వారణాసి సినిమా అనేది పురాతన ప్రపంచం, ఆధునిక యుగం మధ్య కలుగుతున్న ఒక టైం ట్రావెల్ చుట్టూ తిరిగే కథ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
వారణాసి అనే సినిమా టైమ్ ట్రావెల్ సినిమా అని పురాతన ప్రపంచంలో మోడ్రన్ వరల్డ్ గ్లోబ్ ట్రాటర్ గా మహేష్ బాబు కనిపించబోతున్నారని నేటిజన్స్ సైతం పలు రకాల పోస్టులతో వైరల్ గా చేస్తున్నారు. ఇక రాజమౌళి తండ్రి ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ కూడా ఈ సినిమా కథ పైన ఒక హింట్ ఇవ్వడం జరిగింది. ఈ సినిమాలో మహేష్ బాబు నటించిన 30 నిమిషాలు లెంగ్త్ సీన్ హైలెట్ గా ఉంటుందని అలాగే చూస్తూ ఉండిపోతారు. మహేష్ బాబు విశ్వరూపం అందులో ఉంది. కొన్ని సినిమాలు మనుషులు చేస్తుంటారు.. మరికొన్ని సినిమాలు దేవతలు చేయించుకుంటారు.. అనుక్షణం రాజమౌళి గుండెల మీద హనుమాన్ ఉన్నారని చెప్పారు. హనుమకు రామనామం అంటే ఇష్టం అంటూ సినిమా బ్యాక్ డ్రాప్ ని చెప్పేశారు విజయేంద్ర ప్రసాద్. ఈ సినిమా బ్యాక్ డ్రాప్ కూడా హనుమాన్ గురించే అంటూ చెప్పకనే తెలియజేశారు విజయేంద్రప్రసాద్.ఇదంతా విన్నా అభిమానుల సైతం అందుకే రాజమౌళి గ్లోబల్ డైరెక్టర్ అయ్యారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి