గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూశారు. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ఈ వేడుకను జక్కన్న అండ్ టీమ్ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఆర్గనైజ్ చేసి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఆ ఈవెంట్‌లో భాగంగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి - సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న భారీ ప్రాజెక్ట్ ‘ వారణాసి ’ నుంచి విడుదల చేసిన గ్లింప్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. జక్కన్న కట్ చేసిన ఈ గ్లింప్స్ ఆద్యంతం ఊహలకు అందని విజువల్స్‌తో నిండి ఉంది. కథలోని డెప్త్‌ను, సినిమా యొక్క భారీ కాన్వాస్‌ను కొన్ని సెకండ్లలోనే చూపిస్తూ వారణాసి ప్రపంచంలోకి ప్రేక్షకులను పూర్తిగా లాగేశాడు. ముఖ్యంగా ఖండాల మధ్య ప్రయాణం, కాలాల మధ్య సాగిపోయే కథనం ఈ సినిమా కి ఎంత వైవిధ్యమైందో స్పష్టంగా తెలియజేస్తోంది.
అత్యంత చెరగని ముద్రవేసిన షాట్ మాత్రం త్రేతాయుగం నాటి యుద్ధ సన్నివేశం. రామ - రావణ యుద్ధంలో రాముని వానరసేన భుజాలపై ఎత్తుకుని ముందుకు దూకిస్తున్న సన్నివేశం చూసిన క్షణం నుంచే గూస్‌బంప్స్ ఆపుకోలేని పరిస్థితి. ఇలాంటి విజువల్ ప్రెజెంటేషన్, ఇలాంటి ధైర్యమైన ఆలోచన భారత సినీ రంగంలో ఎవరికైనా సాధ్యమా అన్న తరహాలో సినీ ప్రముఖుల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. “ ఇలాంటి థింకింగ్ జక్కన్నకే సాధ్యం ” అనే కామెంట్లు సోషల్ మీడియాలో మార్మోగుతున్నాయి.
ఇక ఈ మెగా ప్రాజెక్ట్‌లో మహేష్ బాబు రుద్ర అనే పాత్రలో కనిపించబోతున్నాడని ఇప్పటికే వెల్లడైంది. రాజమౌళి స్టైల్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ పాత్ర ఎలా ఉండబోతుందా ? అని అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. గ్లింప్స్‌లో చూపించిన యాక్షన్ శైలి, రుద్ర పాత్ర యొక్క ఫియర్స్ ఎనర్జీ సినిమా విడుదలయ్యే నాటికి భారీ రేంజ్ సంచలనాన్ని సృష్టిస్తుందని అన్నీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తానికి ‘వారణాసి’ గ్లింప్స్ ఒక సినిమాకి టీజర్ కాదు … ఒక భారీ ప్రపంచంలోకి ఆహ్వానం లాంటిది. జక్కన్న - మహేష్ కాంబో ఏ స్థాయిలో పనిచేస్తుందో ఈ వీడియో ఒక్కటే చెప్పేస్తోంది.

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి