యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ సినిమా “ కాంత ” ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ తెరకెక్కించిన ఈ బైలింగువల్ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి గ్రాండ్‌గా రిలీజ్ అవ్వడం ద్వారా మంచి అటెన్షన్‌ను తెచ్చుకుంది. రిలీజ్‌కు ముందు ప్రచారంలో ఈ సినిమా పై భారీ బజ్ ఏర్పడింది. అయితే మొదటి రోజు టాక్ తో పాటు ... వ‌చ్చిన రివ్యూలను చూస్తే అంతగా పాజిటివ్ టాక్ రానట్టే కనిపించింది. అయితే బాక్సాఫీస్ దగ్గర మాత్రం కాంత‌ వేరే కథ రాసుకుంది.


రిలీజ్ అయిన మొదటి రోజే ‘కాంత’ ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ సాధించి దుల్కర్ సల్మాన్ కెరీర్‌లో మరో బెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. ఇది దుల్కర్ మార్కెట్, ఆయనకు ఉన్న మంచి ఫాలోయింగ్ రెండింటినీ ఫ్రూవ్‌ చేస్తోంది. ముఖ్యంగా తెలుగు స్టేట్స్‌లో ఈ సినిమాకు అంచనాలకంటే మెరుగైన ఓపెనింగ్స్ నమోదయ్యాయి. తమిళ్ వెర్షన్‌కూ అర్బన్ మార్కెట్స్‌లో మంచి రెస్పాన్స్ వచ్చింది. రెండో రోజు బుకింగ్స్‌ను పరిశీలిస్తే కూడా చాలా ప్రామిసింగ్‌గా ఉన్నాయి. వర్డ్ ఆఫ్ మౌత్ మిక్స్‌డ్‌గా ఉన్నా .. దుల్కర్ క్రేజ్, రానా ప్రమోషన్స్ , విజువల్ ప్రెజెంటేషన్ కారణంగా డే 2 వసూళ్లు కూడా సాలిడ్‌గా ఉంటాయని ట్రేడ్ టాక్. వీకెండ్ మొత్తాన్ని బట్టి ఈ సినిమా ఓ డీసెంట్ రేంజ్‌లో నిలబడే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. మొత్తానికి ‘ కాంత ’ మంచి వీకెండ్ కలెక్షన్స్‌కే కన్నేసి ముందుకు సాగుతోంది.


సినిమా లో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించి తన నటనతో, గ్లామర్‌తో ఆకట్టుకుంది. రానా దగ్గుబాటి, సముద్రఖని కీలక పాత్రల్లో నటించడం కూడా సినిమాకు మేజ‌ర్ ప్ల‌స్ పాయింట్ అయ్యింది. మ‌రీ ముఖ్యంగా రానా - దుల్కర్ ల స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను బాగా ఎట్రాక్ చేస్తోంది. మ‌రో ఆస‌క్తికర విషయం ఏమంటే, నటించడమే కాకుండా రానా దగ్గుబాటి మరియు దుల్కర్ సల్మాన్ ఇద్దరూ ఈ సినిమాకు నిర్మాతలుగా కూడా వ్యవహరించారు. మొత్తానికి “కాంత” మొదటి రోజు నుంచే బాక్సాఫీస్‌ను కదిలించి వాణిజ్యంగా అదిరిపోయే స్టార్టింగ్ న‌మోదు చేస్తోంది. విడుదలైన రోజున వచ్చిన మిక్స్‌డ్ టాక్‌కి లొంగక, కలెక్షన్ల పరంగా దూసుకుపోవడం ఈ సినిమాకు ప్ల‌స్ పాయింట్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: