ఈ మధ్యకాలంలో సినిమా ఏదైనా విడుదలవుతుందంటే చాలు ఆ సినిమా ఈవెంట్లలో దర్శకులు, నిర్మాతలు, హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇలా ఎంతో మంది శపధాలు చేస్తున్నారు. అలా తాజాగా పల్లెటూరి వాతావరణం లవ్ స్టోరీ తో రాజు వెడ్స్ రాంబాయి అనే పేరుతో ఓ సినిమా తెరకెక్కిస్తున్న డైరెక్టర్ కూడా తాజాగా తన సినిమా ఈవెంట్లో సినిమా హిట్ అవ్వకపోతే కట్ డ్రాయర్ తో పరిగెత్తుతా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా రాజు వెడ్స్ రాంబాయి మూవీ నవంబర్ 21న విడుదల కాబోతోంది.అయితే ఈ సినిమా విడుదలకు ముందు ఏర్పాటు చేసిన ఓ ఈవెంట్లో దర్శకుడు సాయి కంపాటి మాట్లాడుతూ.. నాకు పల్లెటూరు వాతావరణంతో ఉన్న సినిమాలు అంటేనే ఇష్టం.

ఇలాంటి సినిమాలకు ప్రజల్లో ఆదరణ కూడా ఉంటుంది. దయచేసి నా సినిమా విడుదలయ్యాక నెగిటివ్ టాక్ ఉన్నట్టు ప్రచారం చేయకండి. ఒకవేళ నా సినిమా విడుదలయ్యాక జనాలకి నచ్చకపోతే నేను అమీర్పేట్ లో కట్ డ్రాయర్ మీద పరిగెత్తుతా..దయచేసి ఒకసారి సినిమా చూసి ఎలా ఉందో చెప్పండి.సినిమా చూడకుండా నెగెటివ్ టాక్ స్ప్రెడ్ చేయకండి అంటూ సాయి కంపాటి సినిమా హిట్ అవ్వకపోతే కట్ డ్రాయర్ మీద అమీర్పేట్ లో పరిగెత్తుతా అంటూ సవాల్ విసిరారు.

 ఇక డైరెక్టర్ ఈ సవాల్ విసరడంతో చాలామంది నెటిజెన్లు ఈ మధ్యకాలంలో సినిమా వారికి శపదాలు చేయడం సవాళ్లు విసరడం కామన్ అయిపోయింది అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఇక రాజు వెడ్స్ రాంబాయి మూవీకి సాయి కంపాటి దర్శకత్వం వహించగా.. అఖిల్ రాజ్, తేజస్వి రావు లు హీరో హీరోయిన్లుగా నటించారు. వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవిలు నిర్మాతలుగా చేసిన ఈ మూవీ నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. మరి పల్లెటూరి స్టైల్ లో రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: